City Police Commissioner M. Mahender Reddy
-
టార్గెట్..సేఫ్ సిటీ
► ఎనిమిది శాతం మేర తగ్గిన నేరాలు ► తీవ్రమైన వాటిపై ప్రత్యేక దృష్టి ► ఆపరేషన్ స్మైల్‌లో దేశంలోనే అగ్రస్థానం ► యూబ్ఖాన్పై చట్ట ప్రకారం చర్యలు ► వార్షిక సమావేశంలో నగర కొత్వాల్ వెల్లడి సిటీబ్యూరో: ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పోలీసుల సమష్టి కృషి ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో 8 శాతం నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో 2016కు సంబంధించి వార్షిక నివేదిక విడుదల చేసేందుకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. సేఫ్ సిటీ స్థాపన లక్ష్యంతో... ‘తెలంగాణ ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి ఆదేశాల మేరకు నగరంలో వ్యవస్థీకృత నేరాలకు తావు లేకుండా, దేశంలోనే ఉత్తమ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడానికి సిటీ పోలీసు వింగ్ అహర్నిశలు పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరిగిన బోనాలు, గణేష్ ఉత్సవాలు సహా అన్ని కీలక ఘట్టాలనూ చిన్న ఉదంతం కూడా లేకుండా పూర్తి చేయగలిగాం. ఒకప్పుడు నగరంలో మహిళలు ఆభరణాలు ధరించి బయటకు రావడానికి భయపడేవారు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని పని చేయడంతో స్నాచింగ్స్ కేసుల్లో 66 శాతం తగ్గుదల నమోదైంది. తీవ్రమైన నేరాలు 31 శాతం, ప్రాపర్టీ అఫెన్సులు 16 శాతం, వేధింపులు 18 శాతం, మహిళలపై జరిగే నేరాలు 12 శాతం తగ్గుదల నమోదుచేసుకున్నాయి. షీ–టీమ్స్ పని తీరు కారణంగా వేధింపుల కేసులు 1175 (2015) నుంచి 969కు (2016) వచ్చాయి. నేరగాళ్ళకు శిక్షలు పడేలా చర్యలు... కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పెండెన్సీ తగ్గించడం, నేరగాళ్ళపై కేసులు రుజువు చేయడానికి అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసు మేళాలు చేపట్టాం. ఫలితంగా 50 శాతం పెండెన్సీ తగ్గింది. కరుడుగట్టిన, పదేపదే నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నాం. మరోపక్క న్యాయవ్యవస్థతో సమన్వయం ఏర్పాటు చేసుకుని వారు జైల్లో ఉండగానే కేసు విచారణ పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నాం. ఫలితంగా నేరం నిరూపితమయ్యే కేసుల శాతం 36కు పెరగడంతో పాటు 23 మందికి జీవితఖైదు పడింది. సేఫ్ సిటీగా పిలిచే చెన్నైలో ప్రతి ఏడాది 2500 మంది నేరగాళ్ళపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకుంటూ సిటీలో ఈ ఏడాది 283 మందిపై ప్రయోగించాం. దీంతో ఇప్పటి వరకు మొత్తం 547 మందిపై ఇది ప్రయోగించినట్లైంది. ప్రజల కోసం, వారి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది వీటి ఆధారంగా 244 కేసుల్లో ఆధారాలు లభించగా... 210 మందిని గుర్తించి అరెస్టు చేశాం. బాలబాలికల కోసం ‘స్మైల్’... ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేస్తున్న, బాల్యాన్ని కార్ఖానాలకు అంకితం చేస్తున్న బాలబాలికల విముక్తి కోసం ఆపరేషన్ స్మైల్ చేపట్టి వారిని రెస్క్యూ చేస్తున్నాం. 800 మందికి పైగా బాలకార్మికులకు విముక్తి కల్పించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. సుప్రీం కోర్టు గతంలో ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66 (ఎ)ను తొలగించింది. దీనిస్థానంలో రావాల్సిన మరో సెక్షన్ అమలులోకి రాలేదు. దీంతో ఈ సెక్షన్ కింద నమోదు చేసే కేసులు తగ్గడంతో సైబర్ క్రైమ్స్‌లో 24 శాతం తగ్గుదల నమోదైంది. ట్రాఫిక్ విషయంలో హైదరాబాద్ సిటీ దేశంలోనే ఉత్తమంగా ఉంది. అయినప్పటికీ సంతృప్తి పడకుండా ఇంకా మెరుగుదలకు కృషి చేస్తున్నాం. వివిధ రకాల క్రమశిక్షణా చర్యల కింద ఈ ఏడాది దాదాపు 25 మంది పోలీసుల్ని డిస్మిస్ చేశాం. పోలీసు ట్విన్ టవర్స్ పనులు ప్రారంభమయ్యాయి. 21 నెలల్లో నిర్మాణం పూర్తవుతుంది. ఈ లోపు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. పదేపదే ‘నిర్లక్ష్యాలపై’ చర్యలు... నగరంలోని కొన్ని ఆస్పత్రులు, స్కూళ్ళల్లో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. వీరి నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ప్రస్తుతం ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఓకే హాస్పటల్, స్కూల్లో పదేపదే ఉదంతాలు జరిగితే వాటి లైసెన్సులు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించాం.’ అని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అయూబ్‌ఖాన్ కేసులపై ప్రత్యేక దృష్టి... సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేసిన అయూబ్‌ఖాన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. అతడు సాక్షుల్ని బెదిరించే, ప్రభావితం చేసే ఆస్కారం లేకుండా జైల్లో ఉన్నప్పుడే కేసుల విచారణ పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తాం. ఇతడి బోగస్ పాస్‌పోర్ట్ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రాథమిక సమాచారం బట్టి శిక్షపడక ముందే దీన్ని పొందాడని తెలుస్తోంది. ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నట్లు తేలినా బాధ్యులైన సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటాం. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. నగరంలో సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా దీనికి ఆకర్షితులైన వారిని గుర్తించి కుటుంబీకులు, సంబంధీకులతో కలిపి డీ–రాడికలైజేషన్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. హద్దులు దాటిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాం. మరోపక్క మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరుగుతున్న ప్రమాదాలు నిరోధించే చర్యలు తీసుకుంటున్నాం. 2015లో 16,633 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా... 2940 మంది జైలుకు వెళ్ళారు. నవంబర్ 30 వరకు 16,602 కేసులు నమోదుకాగా.. జైలుకు వెళ్ళిన వారి సంఖ్య 7017గా ఉంది. ‘నిషా’చరుల నుంచి రూ.2,92,40,700 జరిమానా వసూలైంది. -
‘న్యూ ఇయర్’లో నిబంధనలు తప్పొద్దు
డీజే, ఆర్కెస్ట్రాపై ఆంక్షలు వేడుకలు సజావుగా జరుపుకోండి నిర్వాహకులకు నగర పోలీసు కమిషనర్ సూచన సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే స్టార్ హోటళ్లు, పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ నిర్వాహకులు డీజే, ఆర్కెస్ట్రాపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆంక్షలు విధించారు. వేడుకల్లో అపశ్రుతులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో స్టార్ హోటల్స్, పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ ప్రతినిధులతో ఆయన శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... నూతన సంవత్సర వేడుకలను సజావుగా జరుపుకోవాలని కోరారు. వేడుక నిర్వహణకు అవసరమైన 27 సూచనలు, నిబంధనలను ఆయన విడుదల చేశారు. వేడుకలు నిర్వహించే హోటళ్ల నిర్వాహకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకల్లో పాల్గొనేవారికి నిర్వాహకులు పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన పరిమితి మేరకే లౌడ్‌స్పీకర్ల సౌండ్ ఉండాలన్నారు. ఆర్కెస్ట్రా ఉపయోగించరాదని స్పష్టం చేశారు. సమావేశంలో స్టార్‌హోటళ్లు, పబ్స్ ప్రతినిధులు 150 మందితో పాటు అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, జితేందర్, జాయింట్ కమిషనర్లు వై.నాగిరెడ్డి, శివప్రసాద్, డీసీపీలు సుధీర్‌బాబు, కమలాసన్‌రెడ్డి, డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు. టాస్క్‌ఫోర్స్/ఎస్ఓటీ ప్రత్యేక నిఘా... న్యూఇయర్ వేడుకల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి భరతం పట్టేం దుకు నగర ంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, శివార్లలో స్పెషల ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీ సులు సిద్ధమయ్యాయి. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీధర్ (ఈస్ట్) సూర్యప్రకాష్‌రావు (సౌత్) ఆనంద్‌కుమార్(నార్త్) భాస్కర్ (సెంట్రల్, వెస్ట్), ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఈస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్ వెస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్లు గురురాఘవేంద్ర, వెంకట్‌రెడ్డి, ఎస్ఐలు రాములు, ఆంజనేయులు, శివ, చైతన్యకుమార్‌లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. జంట పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కూడా వీరు చర్యలు తీసుకుంటారు. రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో రేవ్‌పార్టీలు, పేకాట, మద్యం పార్టీలు నిర్విహ స్తే దాడులు చేస్తారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారి వివరాలను వీరు ఇప్పటికే ఇన్ఫార్మర్ల ద్వారా సేకరిస్తున్నారు. -
గస్తీ పోలీసులకు 12 గంటలే డ్యూటీ..
నేటి నుంచి అమలు సిటీబ్యూరో: గస్తీ నిర్వహించే పోలీసులకు నేటి నుంచి 12 గంటలే విధులు నిర్వహించే కొత్త విధానానికి నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గతంలో గస్తీ పోలీసులు 24 గంటలు విధులు నిర్వహించేవారు. నిరాటకంగా 24 గంటలు విధుల్లో ఉండటం వల్ల నిద్రలేమితో సరిగా విధులు నిర్వహించలేకపోతున్నారనే వాదన ఉంది. దీంతో గస్తీ వ్యవస్థ కుంటుపడుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం కమిషనర్ మిగతా అధికారులతో చర్చించారు. పెట్రోలింగ్ సిబ్బందికి నిరాటకంగా 24 గంటలు డ్యూటీ కాకుండా 12 గంటలు డ్యూటీ వేస్తే సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తారనే నిర్ణయానికి వచ్చారు. తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని మహేందర్‌రెడ్డి భావించారు. పాత ప ద్ధతి గస్తీకి (నిరాటకంగా 24 గంటలు విధులు నిర్వర్తించడం) స్వస్తి చెప్పి గురువారం నుంచి 12 గం టల పాటు విధులు నిర్వహించే విధం గా చర్యలు తీసుకోవాలని మహేందర్‌రెడ్డి ఐదు జోన్ల డీసీపీల కు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గస్తీ పోలీసులు 24 గంటలు డ్యూటీ చేసి... 24 గంటలు రెస్ట్ తీసుకునేవారు. కొత్త విధానంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహించి..ఆ తర్వాత రాత్రి 9 నుంచి ఉదయం 9 గంటల వరకు రెస్ట్ తీసుకుంటారు. రోజుకు రెండు షిప్టుగా మార్చారు. ఒక్కో ఠాణా పరిధిలో గస్తీ తిరిగేందుకు ప్రత్యేకంగా 4 బ్లూ కోల్ట్స్ బృందాలు ( బైక్‌పై ఇద్దరేసి సిబ్బంది), రెండు కార్లపై పెట్రోలింగ్ (కారులో ఇద్దరేసి) ఉ ంటారు. వీరికి మాత్రమే 12 గంటల డ్యూటీ వర్తిస్తుంది. ఇక శాంతి భద్రతల విభాగంలో విధులు నిర్వహిస్తున్న మిగతావారికి 24 గంటలు డ్యూటీ, 24 గంటలు రెస్ట్ (పాత డ్యూటీనే) ఉంటుంది. అ యితే పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది వాదన మ రోలా ఉంది. 12 గంటలు విధులు నిర్వహించి ఇం టికి వెళ్లి తిరిగి ఉదయాన్నే రావాలంటే ఇబ్బందిగా ఉంటుందంటున్నారు. దాని బదులుగా 8 గంటల డ్యూటీ ఉంటే బాగుంటుందంటున్నారు.