నేటి నుంచి అమలు
సిటీబ్యూరో: గస్తీ నిర్వహించే పోలీసులకు నేటి నుంచి 12 గంటలే విధులు నిర్వహించే కొత్త విధానానికి నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గతంలో గస్తీ పోలీసులు 24 గంటలు విధులు నిర్వహించేవారు. నిరాటకంగా 24 గంటలు విధుల్లో ఉండటం వల్ల నిద్రలేమితో సరిగా విధులు నిర్వహించలేకపోతున్నారనే వాదన ఉంది. దీంతో గస్తీ వ్యవస్థ కుంటుపడుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం కమిషనర్ మిగతా అధికారులతో చర్చించారు. పెట్రోలింగ్ సిబ్బందికి నిరాటకంగా 24 గంటలు డ్యూటీ కాకుండా 12 గంటలు డ్యూటీ వేస్తే సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తారనే నిర్ణయానికి వచ్చారు. తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని మహేందర్‌రెడ్డి భావించారు. పాత ప ద్ధతి గస్తీకి (నిరాటకంగా 24 గంటలు విధులు నిర్వర్తించడం) స్వస్తి చెప్పి గురువారం నుంచి 12 గం టల పాటు విధులు నిర్వహించే విధం గా చర్యలు తీసుకోవాలని మహేందర్‌రెడ్డి ఐదు జోన్‌ల డీసీపీల కు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గస్తీ పోలీసులు 24 గంటలు డ్యూటీ చేసి... 24 గంటలు రెస్ట్ తీసుకునేవారు.
కొత్త విధానంలో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహించి..ఆ తర్వాత రాత్రి 9 నుంచి ఉదయం 9 గంటల వరకు రెస్ట్ తీసుకుంటారు. రోజుకు రెండు షిప్టుగా మార్చారు. ఒక్కో ఠాణా పరిధిలో గస్తీ తిరిగేందుకు ప్రత్యేకంగా 4 బ్లూ కోల్ట్స్ బృందాలు ( బైక్‌పై ఇద్దరేసి సిబ్బంది), రెండు కార్లపై పెట్రోలింగ్ (కారులో ఇద్దరేసి) ఉ ంటారు. వీరికి మాత్రమే 12 గంటల డ్యూటీ వర్తిస్తుంది. ఇక శాంతి భద్రతల విభాగంలో విధులు నిర్వహిస్తున్న మిగతావారికి 24 గంటలు డ్యూటీ, 24 గంటలు రెస్ట్ (పాత డ్యూటీనే) ఉంటుంది. అ యితే పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది వాదన మ రోలా ఉంది. 12 గంటలు విధులు నిర్వహించి ఇం టికి వెళ్లి తిరిగి ఉదయాన్నే రావాలంటే ఇబ్బందిగా ఉంటుందంటున్నారు. దాని బదులుగా 8 గంటల డ్యూటీ ఉంటే బాగుంటుందంటున్నారు.
గస్తీ పోలీసులకు 12 గంటలే డ్యూటీ..
Published Wed, Nov 12 2014 11:51 PM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement
Advertisement