షాంఘై: మొబైల్‌లో బుక్ చేసుకుని చైనాలోని ఈ రెస్టారెంట్‌కి వస్తే చాలు. సాదరంగా ఆహ్వానించి కోరిన పదార్థాలు తెచ్చి వడ్డిస్తారు. ‘ఎంజాయ్ యువర్ మీల్ ’అని విష్ చేసి వెళ్తారు. వీరు టిప్ కూడా అడగరు! అవును.. వీరు అంటే మనుషులు కాదు రోబోలు! చైనా వ్యాపార దిగ్గజం ఆలీబాబా ఈ కామర్స్‌లో భాగంగా ఇలాంటి రెస్టారెంట్లను నిర్మించాలయోచిస్తోంది! 2020 వరకు చైనాలో ఇలాంటివి వెయ్యి ప్రారంభించాలని సంకల్పించింది.
చైనాలో వెయిటర్స్ జీతాలు పెరిగిపోతున్నాయని, నెలకు రూ.లక్ష చెల్లించాల్సి వస్తోందని ఈ ప్రతిపాదన రూపకర్త, అలీబాబా ప్రోడక్ట్ మేనేజర్ కావ్ హైతో పేర్కొన్నారు. ఈ భారం వినియోగదారులపై పడి రెస్టారెంట్లలో తినడానికే జంకుతున్నారట. ప్రస్తుతం నలుగురు కలసి భోజనం చేయాలంటే రూ.4,000 ఖర్చవుతుంది. ఈ ప్రతిపాదనతో అది రూ.1,000కి దిగివస్తుందని అంచనా. ‘కార్మికుల జీతాలు ఇలాగే పెరుగుతూ పోతే మనుషుల స్థానంలో రోబోలు వస్తాయనడంలో అనుమానం లేదు’అని రోబోటిక్స్ ప్రొఫెసర్ వాంగ్ అంటున్నా
Comments
Please login to add a commentAdd a comment