workers salaries
-
రెండింతల గౌరవం
ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 16 ఏళ్లకు పైగా మధ్యాహ్న భోజనం వడ్డిస్తూ వస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఇన్నాళ్లూ అరకొరగా ఇచ్చే గౌరవ వేతనంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొన్నిసార్లు నెలల తరబడి నిర్వహణ బిల్లులు రాకున్నా, గౌరవ వేతనం ఊసే లేకున్నా పాఠశాలల్లో చదువుకునే చిన్నారుల కడుపు మాడ్చకూడదన్న ఉద్దేశంతో అప్పులు చేసి మరీ భోజనం వండి పెడుతున్నారు. మరికొందరు మెడలో పుస్తెలను సైతం తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజనం ఆగకుండా నెట్టుకొచ్చారు. తమకు సకాలంలో నిర్వహణ బిల్లులు చెల్లించడంతో పాటు గౌరవ వేతనం పెంచమని ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కోరినా వారిది అరణ్య రోదనే అయింది. నెలకు ఇస్తున్న వెయ్యి రూపాయల గౌరవ వేతనం పెంచమని నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. తమ తలరాత ఇంతేనంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. కార్మికుల మోముల్లో చిరునవ్వులు విరబూ స్తున్నాయి. మధ్యాహ్న భోజన కార్మికుల శ్రమను కొత్త ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే అప్పటి వరకు వారికి అందిస్తున్న రూ.1,000 గౌరవ వేతనాన్ని మూడు వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పథకం పేరును కూడా వైఎస్సార్ అక్షయపాత్రగా మార్పు చేశారు. ఒక్కసారిగా గౌరవ వేతనం రెండింతలు పెంచి తమ గౌరవాన్ని జగన్ పెంచారంటూ మధ్యాహ్న భోజన కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా వారి హయాంలో నామమాత్రపు వేతనం.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 2003లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పొదుపు గ్రూపు మహిళల్లో ఆసక్తి కలిగి ముందుకు వచ్చిన వారికి వారు నివసించే ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. 2003 జనవరి 1వ తేదీ తొలిసారిగా ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. వారికి నామమాత్రపు గౌరవ వేతనం కూడా నిర్ణయించలేదు. కేవలం వెయ్యి రూపాయల గౌరవ వేతనం ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం వారితో చాకిరీ చేయించుకుంటూ వచ్చింది. 2008 ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. 2018 ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరింప చేసింది. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం విస్తరిస్తూ వచ్చినా వాటిని నిర్వహించే కార్మికులకు మాత్రం చంద్రబాబు సర్కార్ చుక్కలు చూపించింది. ఒకవైపు మధ్యాహ్న భోజన నిర్వహణ బిల్లులు రాక, ఇంకోవైపు అరకొరగా ఇచ్చే గౌరవ వేతనం నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడంతో అనేక మంది కార్మికులు అర్ధంతరంగా ఆ పథకం నుంచి తప్పుకున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు. జిల్లాలో మధ్యాహ్న భోజన తీరిది.. జిల్లాలోని 3349 ప్రభుత్వ పాఠశాలలు, 31 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం 5996 మంది కార్మికులు మధ్యాహ్న భోజనాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ముగిసిన విద్యా సంవత్సరంలో 3349 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,78,691 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇంటర్మీడియట్లో కూడా మధ్యాహ్న భోజనం ప్రవేశ పెట్టడంతో జిల్లాలోని 31 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరానికి సంబంధించి 4201 మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 3887 మంది విద్యార్థులు ఈ ఏడాది మార్చి వరకు జరిగిన తరగతుల్లో మధ్యాహ్న భోజనం చేస్తూ వచ్చారు. జగనన్నకు జేజేలు.. మధ్యాహ్న భోజన పథకం అమలులో తాము పడుతున్న కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కార్మికులు జేజేలు కొడుతున్నారు. ఒక్కసారిగా తమ గౌరవ వేతనాన్ని మూడింతలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయంలో తమ జీవితాలకు వెలుగులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
చైనా రెస్టారెంట్లలో అన్ని పనులకూ రోబోలే!
షాంఘై: మొబైల్లో బుక్ చేసుకుని చైనాలోని ఈ రెస్టారెంట్‌కి వస్తే చాలు. సాదరంగా ఆహ్వానించి కోరిన పదార్థాలు తెచ్చి వడ్డిస్తారు. ‘ఎంజాయ్ యువర్ మీల్ ’అని విష్ చేసి వెళ్తారు. వీరు టిప్ కూడా అడగరు! అవును.. వీరు అంటే మనుషులు కాదు రోబోలు! చైనా వ్యాపార దిగ్గజం ఆలీబాబా ఈ కామర్స్‌లో భాగంగా ఇలాంటి రెస్టారెంట్లను నిర్మించాలయోచిస్తోంది! 2020 వరకు చైనాలో ఇలాంటివి వెయ్యి ప్రారంభించాలని సంకల్పించింది. చైనాలో వెయిటర్స్ జీతాలు పెరిగిపోతున్నాయని, నెలకు రూ.లక్ష చెల్లించాల్సి వస్తోందని ఈ ప్రతిపాదన రూపకర్త, అలీబాబా ప్రోడక్ట్ మేనేజర్ కావ్ హైతో పేర్కొన్నారు. ఈ భారం వినియోగదారులపై పడి రెస్టారెంట్లలో తినడానికే జంకుతున్నారట. ప్రస్తుతం నలుగురు కలసి భోజనం చేయాలంటే రూ.4,000 ఖర్చవుతుంది. ఈ ప్రతిపాదనతో అది రూ.1,000కి దిగివస్తుందని అంచనా. ‘కార్మికుల జీతాలు ఇలాగే పెరుగుతూ పోతే మనుషుల స్థానంలో రోబోలు వస్తాయనడంలో అనుమానం లేదు’అని రోబోటిక్స్ ప్రొఫెసర్ వాంగ్ అంటున్నా -
స్థానిక సంస్థలకే నిర్ణయాధికారం!
- కార్మికుల వేతనాలపై నిర్ణయం మున్సిపాలిటీలదే - సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం - 3 శ్లాబుల్లో వేతనాలు.. సీలింగ్ ఖరారుకే సర్కారు పరిమితం సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయాధికారాన్ని మున్సిపాలిటీలకే వదిలేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలవారీగా కార్మికులకు పెంచాల్సిన వేతనాలపై సీలింగ్‌ను మాత్రం ప్రభుత్వమే నిర్ణయించనుంది. సీలింగ్ గరిష్ట అవధికి మించకుండా, కనిష్ట అవధికి తగ్గకుండా వేతనాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మున్సిపాలిటీల పాలకవర్గాలకే సర్కారు కట్టబెట్టే అవకాశాలున్నాయి. పురపాలక శాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలో 67 నగర, పురపాలికలు ఉన్నాయి. ఇందులో దాదాపు 30 వరకూ చిన్న, మధ్యతరహా పురపాలికలు తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాయి. కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలు ప్రస్తుతం వేతనాలనూ సక్రమంగా చెల్లించలేకపోతున్నాయి. వరంగల్, కరీంనగర్ వంటి నగరాలు, పట్టణాలు మినహా ఇతర మున్సిపాలిటీల పరిస్థితి బాగాలేదు. ఆస్తి, ఇతర పన్నులు, లెసైన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం నామమాత్రంగా ఉంటే, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. కార్మికుల వేతనాలు పెంచాలంటే.. ఆస్తి పన్నుల పెంపు తప్పా మరో దారి లేదని పురపాలక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో పురపాలికల ఆర్థిక స్థితిగతులపై తెప్పించుకున్న వాస్తవిక నివేదిక ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేసింది. వేతనాల పెంపు డిమాండ్‌తో మున్సిపల్ కార్మికులు 40 రోజుల పాటు సమ్మె చేసినా.. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేకపోయింది. ఎట్టకేలకు సమ్మె విరమించడంతో వేతనాల విషయంపై ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం తాత్కాలిక కార్మికులకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రూ.8,300, నగర పంచాయతీల్లో రూ.7,300 వేతనాన్ని చెల్లిస్తున్నారు. పురపాలికల స్థాయిని బట్టి ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే వేతనాలు ఉండే అవకాశాల్లేవు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వేతనాల పెంపు కోసం 3 శ్లాబులను నిర్ణయించి సీలింగ్ విధించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నా యి. ఈ శ్లాబుల సీలింగ్ నగర పంచాయతీలకు రూ.8 వేల నుంచి 9 వేలు, మున్సిపాలిటీలకు రూ.9 వేల నుంచి రూ.10 వేలు, కార్పొరేషన్లకు రూ.10 వేల నుంచి రూ.11 వేలు ఉండొచ్చని అధికారుల్లో చర్చ సాగుతోంది. ఈ సీలింగ్‌లోపు ఆయా పురపాలికలే వేతనాలు నిర్ణయించుకోవాలి. పారి శుధ్య కార్మికుల వేతనాలు పెంచే అధికారం ప్రభుత్వానికి లేదని, మున్సిపాలిటీలే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సీఎం కేసీఆర్ పేర్కొనడం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. -
కనీస వేతనానికి అర్హులే
గ్రామ పంచాయతీల్లోని కార్మికుల వేతనాలపై హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ స్థాయిల్లోని కార్మికులకు నియామక పత్రాలు లేకపోయినప్పటికీ, చట్ట ప్రకారం వారు కనీస వేతనాలు పొందేందుకు అర్హులేనని హైకోర్టు స్పష్టం చేసింది. వారికి దక్కాల్సిన కనీస వేతనాలను చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. గ్రామ పంచాయతీల్లోని కార్మికుల సంఖ్య, వారికి చెల్లిస్తున్న వేతనాలతో పాటు వారి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామపంచాయతీల్లోని కార్మికులకు కనీస వేతనాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాజారపు ప్రతాప్ దాఖలు చేసిన పిల్ సోమవారం విచారణకు వచ్చింది. 8 వేల గ్రామపంచాయతీల పరిధిలో పనిచేస్తున్న దాదాపు 55 వేల మంది కార్మికులకు నెలకు రూ.500 నుంచి రూ.1000 మాత్రమే జీతం చెల్లిస్తున్నారని, వారు చట్టం ప్రకారం రూ.2500 పొందేందుకు అర్హులని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వివరించారు. వీరి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వీరి వాదనలు విన్న ధర్మాసనం విచారణను జూలై 6కు వాయిదా వేసింది.