ప్యారడైజ్​ బిర్యానీ.. ఇప్పుడు ఓరుగల్లులో.. | Paradise Food Court Restaurants In Warangal | Sakshi
Sakshi News home page

ప్యారడైజ్​ బిర్యానీ.. ఇప్పుడు ఓరుగల్లులో..

Published Mon, Nov 22 2021 9:25 PM | Last Updated on Mon, Nov 22 2021 9:48 PM

Paradise Food Court Restaurants In Warangal - Sakshi

ఊరూరా..నోరూరే బిర్యానీ ఘుమఘుమలు బిర్యానీ ప్రియుల‍్ని కట్టిపడేస్తున్నాయి. రోజూ కాకపోయినా జిహ్వచాపల్యం ఊరిస్తున్నప్పుడు వారానికి ఒకసారైనా  బిర్యానీ ఆరగించాల్సిందేనన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అందుకే కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన బిర్యాని రుచులు ప్రతీ పల్లెపల్లెకు విస్తరిస్తున్నాయి. తాజాగా బిర్యానీ ఘుమఘమలతో ప్రపంచ రికార్డులను క్రియేట్‌ చేసిన ప్యారడైజ్‌ బిర్యానీ వరంగల్‌ వాసుల్ని కట్టిపడేయనుంది. వరంగల్ కేంద్రంగా  ప్యారడైజ్ తన 43వ ఔట్‌లెట్ ను ప్రారంభించింది.  

బిర్యానీ ఘుమఘుమలు ముక్కుపూటాలను తాకుతుంటే పొట్టకన్నా మనసే ముందు నిండిపోతుందనిపించేలా ట్రైసిటీ వరంగల్-హన్మకొండ-ఖాజీపేట వాసులకు కాదు..హనమకొండ సుబేదారి, శాస్త్రినగర్‌ మెయిన్‌ రోడ్‌ లో ప్యారడైజ్ రెస్టారెంట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మూడు నగరాల వాసులు, వరంగల్ రెండు జిల్లాల వాసులతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని బిర్యానీ ప్రియులందరూ ఇకపై ప్యారడైజ్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, హన్మకొండలోనే ప్యారడైజ్ బిర్యానీ అందుబాటులోకి వచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 రికార్డులు ప్యారిడైజ్‌ బిర్యానీ దాసోహం  
ప‍్యారిడైజ్‌ బిర్యానీ సంస్థ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ లను సృష్టించింది. ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్‌ చేసిన రెస్టారెంట్‌ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్‌ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ లో  అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా మరియు గోల్డెన్‌ స్పూన్‌ అవార్డు ను ఇండియా ఫుడ్‌ ఫోరమ్‌ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్స్‌, జీహెచ్‌ఎంసీ, టైమ్స్‌ ఫుడ్‌ అవార్డ్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా, లైఫ్‌టైమ్‌ అావ్‌మెంట్‌ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement