Paradise biryani
-
రాహుల్ గాంధీ లంచ్.. ప్యారడైజ్ బిర్యానీ.. నీలోఫర్ చాయ్!
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ డిక్లరేషన్ గురించి విస్తృతంగా చర్చ జరిగేలా ప్రచారం చేయాలని సూచించారు.సుమారు రెండు గంటల పాటు గాంధీభవన్‌లో గడిపిన రాహుల్ గాంధీ చాలా ఉత్సాహంగా కనిపించారు. అందరినీ పలకరిస్తూ, ఫొటోలు, సెల్ఫీలు దిగారు. మధ్యాహ్నం 1:53 గంటలకు రాహుల్ గాంధీభవన్‌కు వచ్చారు. తొలిసారి వచ్చిన ఆయనకు పూలదండలు వేసి, వేద పండితుల ఆశీర్వచనం మధ్య ఘనంగా స్వాగతించారు. చదవండి👉🏼 కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్? రాహుల్ తొలుత ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు, టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్, ఓయూ పరిశోధక విద్యార్థి చనగోని దయాకర్‌గౌడ్‌లతో మాట్లాడారు. తర్వాత తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ప్రతినిధులు బి.వేణుగోపాల్‌రెడ్డి, మధు తదితరులు తెలంగాణలో సమస్యలపై రాహుల్‌కు ఒక నివేదిక ఇచ్చారు. విస్తృతస్థాయి సమావేశం అనంతరం పార్టీ సభ్వత్య నమోదులో క్రియాశీలంగా పనిచేసిన వారితో రాహుల్ ఫోటోలు దిగారు. గాంధీభవన్‌లో 35 ఏళ్లుగా స్వీపర్ పనిచేస్తున్న యాదమ్మను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాహుల్‌కు పరిచయం చేశారు. రాహుల్ ఆమెతో సెల్ఫీ దిగారు. ప్యారడైజ్ బిర్యానీ.. నీలోఫర్ చాయ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ తనకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీని ఆస్వాదించారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆయన ప్రత్యేకంగా ప్యారడైజ్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీని కోక్ తాగుతూ తిన్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. తర్వాత పేస్ట్రీ (కేక్) తిన్న రాహుల్.. కొంతసేపటి తర్వాత నీలోఫర్ కేఫ్ నుంచి తెచ్చిన చాయ్‌ను రుచి చూశారు. అంతకుముందు జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ హైదరాబాద్ బిర్యానీ, చాయ్ బాగుంటాయని ప్రస్తావించారు. దీంతో నేతలు వెంటనే ఈ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. చదవండి👉🏻 రాహుల్ సభ సక్సెస్.. కాంగ్రెస్‌లో సమరోత్సాహం -
ప్యారడైజ్ బిర్యానీ.. ఇక దేశమంతటా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు ఏడు దశాబ్దాల పైగా చరిత్ర గల బిర్యానీ చెయిన్ ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్స్ దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ ఏడాది ఆఖరు నాటికి 100 రెస్టారెంట్ల మార్కును అధిగమించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2026–27 నాటికి దీన్ని 500కు పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో గౌతమ్ గుప్తా తెలిపారు. సౌతిండియాలో హైదరాబాద్‌లో 50వ రెస్టారెంట్ ప్రారంభించిన సందర్భంగా సంస్థ సీఈవో గౌతమ్ గుప్తా మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లోని 13 నగరాల్లో కార్యకలాపాలు ఉండగా తూర్పు, పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా విస్తరించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో 200 - 250 రెస్టారెంట్లు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈస్ట్‌లో కోల్‌కతాపై ఫోకస్ చేయనుంది ప్యారడైజ్. తెలుగు రాష్ట్రాల్లో 100 విస్తరణలో భాగంగా త్వరలో దేశవ్యాప్తంగా 450 రెస్టారెంట్లను ప్రారంభించాలని ప్యారడైజ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో వందకు పైగా రెస్టారెంట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నెలకొల్పనుంది. దాదాపుగా పాత జిల్లా కేంద్రాలు, ప్రముఖ పట్టణాల్లో రెస్టారెంట్లు వచ్చే ఆస్కారం ఉంది. ఇటీవల వరంగల్ లాంటి టైర్ టూ సిటీలో కూడా రెస్టారెంట్ ప్రారంభించింది ప్యారడైజ్. త్వరలో ఇతర పట్టణాల్లోనూ ప్యారడైజ్ బిర్యానీ అందుబాటులోకి రానుంది. విదేశాల్లో సికింద్రాబాద్‌లో ప్యారడైజ్ సినిమా థియేటర్‌కి అనుబంధంగా చిన్న క్యాంటీన్‌గా ప్యారడైజ బిర్యానీ ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా బిర్యానీ బ్రాండ్‌గా ఎదిగింది. త్వరలోనే యూకే, యూఎస్, మిడిల్ ఈస్ట్, సౌత్ఈస్ట్ దేశాల్లోనూ ఫ్రాంచైజీ పద్దతిన రెస్టారెంట్లు ప్రారంభించనుంది. ప్యారడైజ్ ఫుడ్‌కోర్ట్స్ 2027 నాటికి రూ. 2,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి:హైదరాబాద్ స్టార్టప్ కంపెనీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..! -
ప్యారడైజ్ బిర్యానీ.. ఇప్పుడు ఓరుగల్లులో..
ఊరూరా..నోరూరే బిర్యానీ ఘుమఘుమలు బిర్యానీ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. రోజూ కాకపోయినా జిహ్వచాపల్యం ఊరిస్తున్నప్పుడు వారానికి ఒకసారైనా బిర్యానీ ఆరగించాల్సిందేనన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అందుకే కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన బిర్యాని రుచులు ప్రతీ పల్లెపల్లెకు విస్తరిస్తున్నాయి. తాజాగా బిర్యానీ ఘుమఘమలతో ప్రపంచ రికార్డులను క్రియేట్ చేసిన ప్యారడైజ్ బిర్యానీ వరంగల్ వాసుల్ని కట్టిపడేయనుంది. వరంగల్ కేంద్రంగా ప్యారడైజ్ తన 43వ ఔట్లెట్ ను ప్రారంభించింది. బిర్యానీ ఘుమఘుమలు ముక్కుపూటాలను తాకుతుంటే పొట్టకన్నా మనసే ముందు నిండిపోతుందనిపించేలా ట్రైసిటీ వరంగల్-హన్మకొండ-ఖాజీపేట వాసులకు కాదు..హనమకొండ సుబేదారి, శాస్త్రినగర్ మెయిన్ రోడ్ లో ప్యారడైజ్ రెస్టారెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మూడు నగరాల వాసులు, వరంగల్ రెండు జిల్లాల వాసులతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని బిర్యానీ ప్రియులందరూ ఇకపై ప్యారడైజ్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, హన్మకొండలోనే ప్యారడైజ్ బిర్యానీ అందుబాటులోకి వచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు ప్యారిడైజ్ బిర్యానీ దాసోహం ప్యారిడైజ్ బిర్యానీ సంస్థ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లను సృష్టించింది. ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్ చేసిన రెస్టారెంట్ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్ కాంగ్రెస్ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా మరియు గోల్డెన్ స్పూన్ అవార్డు ను ఇండియా ఫుడ్ ఫోరమ్ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్ హోటల్స్ అసోసియేషన్స్, జీహెచ్ఎంసీ, టైమ్స్ ఫుడ్ అవార్డ్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణా, లైఫ్‌టైమ్ అావ్‌మెంట్ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది -
పారడైజ్ బిర్యానీలో వచ్చిన పురుగు
-
ప్యారడైజ్ విజేతలకు బిర్యానీ ఫ్రీ
రాంగోపాల్‌పేట్: ఇటీవల ప్యారడైజ్ హోటల్ ప్రారంభించిన వరల్డ్ కప్ విత్ ప్యారడైజ్ కాంటెస్ట్‌లో విజేతలకు ఏడాది పాటు ఉచితంగా బిర్యానీ అందించనున్నట్టు ప్యారడైజ్ సంస్థ చైర్మన్ అలీ హిమ్మతి, సీఈఓ గౌతంగుప్తా తెలిపారు. శుక్రవారం హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారం రోజుల్లో విజేతలుగా నిలిచిన 10 మందికి ఏడాది పాటు ఉచిత బిర్యానీ కూపన్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ హోటల్లో భోజనం చేసి ఫొటో తీసి ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తే వాటికి వచ్చే లైకులు, మంచి కామెంట్లను బట్టి విజేతలకు ఎంపిక చేస్తున్నామన్నారు. గత వారం రోజుల్లో వెయ్యి మంది ఇలా సామాజిక మాధ్యమాల్లో హాష్‌ట్యాగ్ చేశారని, 2.5 మిలియన్ మంది అభిప్రాయాలను పంచుకున్నారని వారు తెలిపారు. ఈ కాంటెస్ట్ జూలై 18వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. 65 ఏళ్ల ప్యారడైజ్ గమనంలో హైదరాబాద్ సంస్కృతి, ఆహారపు అలవాట్లలో భాగమై ప్రత్యేకతను నిలుపుకుందని, ఇటీవల ప్రారంభించిన ‘ప్యారడైజ్ సర్కిల్’ కార్యక్రమంలో 1.4 మిలియన్ వినియోగదారులు భాగస్వాములయ్యారన్నారు. విజేతలకు ఉచిత బిర్యానీ కూపన్లు ఇస్తున్న అలీ హిమ్మతి, గౌతంగుప్తా -
ప్యారడైజ్‌లో ఛాయ్ తాగిన సచిన్
-
ప్యారడైజ్‌లో టిఫిన్ తిని, ఛాయ్ తాగిన సచిన్
హైదరాబాద్ : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుక్రవారం నగరంలో సందడి చేశారు. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్లో ఆయన టిఫిన్ తిని, ఇరానీ ఛాయ్ తాగారు. ప్యారడైజ్ హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు సచిన్ ఇక్కడకు విచ్చేసినట్లు సమాచారం. కాగా సచిన్‌ను చూసేందుకు ప్యారడైజ్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు, సామాన్యులు బారులు తీరారు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు, పోలీసులు కూడా తమ సెల్ ఫోన్లలో సచిన్‌ను ఫోటోలు తీసేందుకు పోటీ పడ్డారు. ఇక గతంలో రాహుల్ గాంధీ కూడా హైదరాబాదు నగర పర్యటనలో ప్యారడైజ్ బిర్యానీ రుచి చూశారు. అలాగే ఎంపీలు ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ తదితరులు ఈ బిర్యానీని రుచి చూసినవారే. -
బిర్యానీ ప్రియుల ప్యారడైజ్ !
సాక్షి, హైదరాబాద్: 1953 నాటి మాట.. సికింద్రాబాద్‌లో ‘ప్యారడైజ్ టాకీస్’ పేరిట సినిమా థియేటర్ నడిచేది. థియేటర్‌కు అనుబంధంగా సమోసా, చాయ్, బిస్కెట్ అమ్మే చిన్న టీ కొట్టు ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాన్ని నడిపేవారు. మెల్లగా ప్యారడైజ్ టాకీస్ కనుమరుగైపోయింది. కానీ హుస్సేన్ హిమ్మతీ టీకొట్టు మాత్రం మెల్లగా ఎదగటం మొదలుపెట్టింది. 10 మందికి పని కల్పించిన ఆ టీ కొట్టు ఇప్పుడు 800 మందికి పైగా ఉద్యోగాలిచ్చే ప్యారడైజ్ హోటల్‌గా ఎదిగింది. హుస్సేన్ తర్వాత ఆయన కొడుకులు అలీ హిమ్మతీ, డాక్టర్ ఖాజీం హిమ్మతీలు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే లా దాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మొత్తం 2.5 లక్షల చ.అ. విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి. స్థానికానికే ప్రాధాన్యం... దేశ, విదేశీ ప్రతినిధుల నోరూరించే ప్యారడైజ్ బిర్యానీ తయారీకి వస్తువుల్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారనేది చాలా మంది ప్రశ్న. ప్యారడైజ్ బిర్యానీకి ఉపయోగించే ధావత్ బాస్మతీ బియ్యాన్ని ఢిల్లీ నుంచి, సుగంధ ద్రవ్యాలైన సాఫ్రాన్‌ను కాశ్మీర్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మాంసం ఉత్పత్తుల్ని మాత్రం హైదరాబాద్‌లోని చెంగిచెర్ల నుంచి, తృణ ధాన్యాలు, గరం మసాలా, ఇతర దినుసులన్నిటినీ బేగంబజార్ నుంచే తెచ్చుకుంటారు. ఇవన్నీ స్థానికంగా లభించేవే. మొదటి గ్రేడువే వాడుతుంటారు. ‘‘మేం బిర్యానీ కోసం ఉపయోగించే మాంసం ఎంత లేతదంటే.. పచ్చి మాంసంతోనే బిర్యానీ వంటకం మొదలుపెడతాం’’ అంటారు గత 30 ఏళ్లుగా ప్యారడైజ్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్. హైదరాబాద్ నుంచి దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో బిర్యానీ పార్శిల్స్ వెళ్తుంటాయి. త్వరలో మరో 4 బ్రాంచీలు.. ప్రస్తుతం సికింద్రాబాద్ ప్యారడైజ్తో పాటు హైదరాబాద్‌లో 6 ప్యారడైజ్ హోటళ్లున్నాయి. హైటె క్‌సిటీ, మాసబ్‌ట్యాంక్, ఎన్టీఆర్ గార్డెన్, కూకట్పల్లి, బేగంపేటల్లో ఇవి పనిచేస్తున్నాయి. ఈ ఏడాదిలో దిల్సుఖ్నగర్, ఏఎస్‌రావ్ నగర్, నాంపల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మరో 4 హోటళ్లు ప్రారంభం కానున్నా చెప్పారు ఖాజిం హిమ్మతీ. ఇప్పటికే అందుబాటులో ఉన్న కూకట్పల్లి ప్యారడైజ్ హోటల్ నుంచి హోమ్ డెలివరీని కూడా ప్రారంభిస్తున్నామని, జనాదరణ బట్టి మిగతా బ్రాంచీలకూ హోమ్ డెలివరీని విస్తరిస్తామని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారాయన. ఇత ర నగరాల్లోనూ... : ఇప్పటిదాకా హైదరాబాద్ వాసులు మాత్రమే రుచిచూసిన తమ బిర్యానీని ఇతర జిల్లాలు, మెట్రో నగరాలకు సైతం అందించడానికి ప్యారడైజ్ ప్రణాళికలు వేస్తోంది. 2015 ముగిసేలోగా రాష్ర్టంలోని విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లోను, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ ప్యారడైజ్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి. ఏ నగరంలో మొదట ప్రారంభించాలి? అక్కడ అనువైన ప్రాంతమేది? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆదరణ, అవసరాలను బట్టి బ్రాండ్ అంబాసిడర్ ను కూడా ఎంపిక చేసుకుంటారు. పాఠశాల నుంచి మేనేజ్మెంట్ వరకు.. ఇప్పటివరకు ప్యా రడైజ్ హోటళ్లలో పనిచేసే వారంతా హోటల్ మేనేజ్మెంట్లలో శిక్షణ పూర్తి చేసినవారే. ఎక్కడో కోర్సులు పూర్తి చేసిన వారికి కాకుండా తామే సొంతగా శిక్షణ ఇవ్వటానికి ప్యారడైజ్ హోటల్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ‘ప్యారడైజ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ‘ప్యారడైజ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్’ను కూడా ప్రారంభించనున్నారు. హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణతో పాటు శిక్షణానంతరం తమ బ్రాంచీల్లో ఉద్యోగులుగా కూడా నియమించుకుంటారు. రుచి చూడని వారు లేరు... హైదరాబాద్‌కు ప్రముఖులు ఎవరొచ్చినా ప్యారడైజ్ బిర్యానీ రుచి చూడాలని కోరుకుంటారు. రాహుల్‌గాంధీ, ఎంపీలు జ్యోతిరాదిత్య సింధియా, ప్రియాదత్, సచిన్‌పైలట్, మిలింద్ దేవరా, కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, క్రికెట ర్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి; చిత్రకారుడుఎంఎఫ్ హుస్సేన్, నాటి మంత్రులు గురుమూర్తి, రోడా మిస్త్రీ, సికింద్రాబాద్ మేయర్ సాంబయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ప్రముఖుల లిస్ట్ చాలా పెద్దదేనన్నారు ఖజీం హిమ్మతీ. ‘పీ’ లోగో ఉంటేనే ప్యారడైజ్...: ప్యారడైజ్ పేరుతో నగరంలో చాలా హోటళ్లు, బేకరీలున్నాయని అవన్నీ తమవి కావని ఖాజీం చెప్పారు. ‘పీ- అనే అక్షరం, 1953 ఉన్న లోగో హోటళ్లు మాత్రమే మావి. సికింద్రాబాద్‌లోని సెంట్రల్ కిచెన్లోనే బిర్యానీ వండుతాం. ఇక్కడి నుంచే అన్ని బ్రాంచీలకు సరఫరా చేస్తాం. రాబోయే తరాలూ ఈ వ్యాపారంలోనే ఉంటాయి’ అన్నారాయన. -
సచిన్ రిటైర్మెంట్ నిర్ణయంపై అభిమానుల ఆవేదన
సాక్షి, సిటీస్పోర్ట్స్ : టెస్ట్ మ్యాచ్‌లకు గుడ్ బై చెబుతూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తీసుకున్న నిర్ణయంపై నగరంలో సచిన్ అభిమానులు ప్చ్... అనేశారు. మరికొంతకాలం ఆడి ఉంటే బావుండేదని కొందరు పేర్కొంటే... రిటైర్మెంట్ తర్వాత క్రికెట్లో భారతదేశాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దే అకాడమీని ఏర్పాటు చేయాలని మరికొందరు సూచించారు. సచిన్‌కు భాగ్యనగరంతో ఎంతో అనుబంధం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టక ముందే జింఖానా మైదానంలో ముంబై - హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన అనేక మ్యాచ్‌ల్లో సచిన్ పాల్గొని రాణించాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్‌లో సచిన్‌కు అనేక రికార్డులున్నాయి. సచిన్ హైదరాబాద్‌లో న్యూజిల్యాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడినప్పటికి పెద్దగా పరుగులేవీ సాధించలేదు. ఆయన టెస్ట్ మ్యాచ్‌ల్లో కంటే వన్డే రికార్డులకు హైదరాబాద్ ప్రధాన వేదికగా ఉపయోగపడింది. హైదరాబాద్‌లో తొలి అడుగులివే.. 1988-89 రంజీ సీజన్లో సచిన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అడుగెట్టాడు. ఇదే సీజన్లో 1989 ఫిబ్రవరి 3 నుంచి హైదరాబాద్- బొంబాయి జట్ల మధ్య సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగిన నాలుగు రోజుల ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం సచిన్ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చాడు. దిలీప్ వెంగ్‌సర్కార్ కెప్టెన్‌గా వ్యహరించిన బొంబాయి జట్టులో సచిన్‌తో పాటు రవిశాస్త్రి, సంజయ్ మంజ్రేకర్, చంద్రకాంత్ పండిట్, లాల్‌చంద్ రాజ్‌పుత్, రాజు కులకర్ణి తదితరులు జట్టు సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ జట్టులో అజారుద్దీన్, అర్షద్ అయూబ్, వెంకటపతిరాజు, ఎం.వీ.శ్రీధర్, ఎంవీ నర్సింహరావు, అ బ్దుల్ అజీం, వివేక్ జైసింహ వంటి క్రికెటర్లు పాల్గొన్నారు. బాంబే జట్టు ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్ సందర్భంగా జిం ఖానా మైదానంలోని హెచ్‌సీఏ డ్రెస్సింగ్ రూంలో సచిన్‌తో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు ఫోటోలు దిగారు. ప్యారడైజ్ బిర్యానీ అదిరిందన్న సచిన్ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఆడేందుకు 2003-2004లో హైదరాబాద్ వచ్చిన సచిన్ ప్యారడైజ్ బిర్యానీ రుచి చూశారు. గ్రాండ్ కాకతీయ హోటల్లో బస చేశారు. సచిన్ ప్యారడైజ్‌కు వచ్చి బిర్యానీ తినేందుకు సిద్ధం కాగా సెక్యూరిటీ కారణాలతో భద్రతా సిబ్బంది వారించారు. దీంతో ప్యారడైజ్ హోటల్ నుంచి బస చేసిన హోటల్‌కే హైదరాబాద్ మటన్ బిర్యానీ తెప్పించుకుని టేస్ట్ చేశారు. బిర్యానీ తీసుకుని వెళ్లిన హోటల్ మేనేజర్ శాబిర్ఖాన్తో సచిన్ మాట్లాడుతూ బిర్యానీ టేస్ట్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. 1999లో ఎల్బీ స్టేడియంలో న్యూజిల్యాండ్‌పై జరిగిన వన్డేలో 186 పరుగులతో నాటౌట్. 2009లో ఆస్ట్రేలియాతో జరిగిన హీరోహోండా కప్ మ్యాచ్‌లో కేవలం 141 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. 2003లో న్యూజిల్యాండ్‌పై 102 పరుగులతో 36వ సెంచరీ చేశాడు. క్రికెట్ చరిత్రలోనే ఎవర్గ్రీన్.. ప్రపంచ క్రికెట్ చర్రితలోనే సచిన్ ఎవర్గ్రీన్. నా జీవితంలో సచిన్ వంటి కష్టజీవి, నైపుణ్యం గల క్రికెటర్ని ఎవరినీ చూడలేదు. సచిన్ రిటైర్మెంట్ క్రి కెట్ ప్రియులకు తీరని లోటు. కానీ, సచిన్ ఓ క్రికెటర్‌గా, మంచి మనిషిగా ప్రజలందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారు. - బస్వరాజ్, బీసీసీఐ డాటా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ భావి క్రికెటర్లకు ఆదర్శం.. భావి క్రికెటర్లకు సచిన్ టెండూల్కర్ ఆదర్శంగా నిలుస్తారు. సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో చాలామంది క్రీడాకారులు రాణిస్తున్నారు. భారత క్రికెట్ టీంలో సచిన్ లోటు పూరించలేనిది. ఆటతోనే కాదు సమాజ సేవల్లోనూ సచిన్ ఎప్పుడూ ముందుంటాడు. - ఎంవీ. శ్రీధర్, హెచ్‌సీఏ సెక్రటరీ సచిన్ సేవలు మరువలేనివి భారత క్రికెట్ టీంను ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్‌గా నిలపడంలో సచిన్ కృషి ఎనలేనిది. సచిన్ మైదానంలో దిగుతున్నాడంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. ఈ విషయాన్ని స్వయానా ఆస్ట్రేలియన్ మేటి బౌలర్ షేన్ వార్న్ ఒప్పుకున్నాడంటే సచిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సేవలను ఎవరూ మరిచిపోలేరు. - అక్షంత్రెడ్డి, హైదరాబాద్ రంజీ టీం కెప్టెన్ వినేందుకు బాధగా ఉన్నా.. ప్రపంచమంతా గర్వించతగ్గ గొప్ప క్రీడాకారుడు సచిన్. ప్రతి క్రీడాకారునికి రిటైర్మెంట్ తప్పనిసరి. అయితే సచిన్ లాంటి గొప్ప వ్యక్తి సేవల్ని రిటైర్మెంట్ అనంతరం ఉపయోగించుకునే అంశం ప్రభుత్వం, బీసీసీఐ చేతుల్లో ఉంటుంది. సచిన్ రిటైర్మెంట్ ప్రకటన వినేందుకు బాధగా ఉన్నా.. ఆయన ఇతర మార్గాల్లో క్రీడారంగానికి సేవ చేయాలని కోరుకుంటున్నా. - సైనా నెహ్వాల్