
రాంగోపాల్‌పేట్: ఇటీవల ప్యారడైజ్ హోటల్ ప్రారంభించిన వరల్డ్ కప్ విత్ ప్యారడైజ్ కాంటెస్ట్‌లో విజేతలకు ఏడాది పాటు ఉచితంగా బిర్యానీ అందించనున్నట్టు ప్యారడైజ్ సంస్థ చైర్మన్ అలీ హిమ్మతి, సీఈఓ గౌతంగుప్తా తెలిపారు. శుక్రవారం హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారం రోజుల్లో విజేతలుగా నిలిచిన 10 మందికి ఏడాది పాటు ఉచిత బిర్యానీ కూపన్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ హోటల్లో భోజనం చేసి ఫొటో తీసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తే వాటికి వచ్చే లైకులు, మంచి కామెంట్లను బట్టి విజేతలకు ఎంపిక చేస్తున్నామన్నారు. గత వారం రోజుల్లో వెయ్యి మంది ఇలా సామాజిక మాధ్యమాల్లో హాష్‌ట్యాగ్ చేశారని, 2.5 మిలియన్ మంది అభిప్రాయాలను పంచుకున్నారని వారు తెలిపారు. ఈ కాంటెస్ట్ జూలై 18వ తేదీ వరకు కొనసాగుతుందని వివరించారు. 65 ఏళ్ల ప్యారడైజ్ గమనంలో హైదరాబాద్ సంస్కృతి, ఆహారపు అలవాట్లలో భాగమై ప్రత్యేకతను నిలుపుకుందని, ఇటీవల ప్రారంభించిన ‘ప్యారడైజ్ సర్కిల్’ కార్యక్రమంలో 1.4 మిలియన్ వినియోగదారులు భాగస్వాములయ్యారన్నారు.
విజేతలకు ఉచిత బిర్యానీ కూపన్లు ఇస్తున్న అలీ హిమ్మతి, గౌతంగుప్తా
Comments
Please login to add a commentAdd a comment