
సాక్షి, హైదరాబాద్ : ప్యారడైజ్ హోటల్స్ తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రపంచకప్ 2019 టోర్నీ నేపథ్యంలో క్రికెట్ ప్రియులకు #WorldCupWithParadise అనే పోటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోటీలో పాల్గొని గెలిచిన వారికి ఏడాదిపాటు వారంలో ఒక బిర్యానీ చొప్పున 52 వారాలు ఉచితంగా బిర్యానీని గిఫ్ట్ రూపంలో పొందవచ్చని వెల్లడించింది. ఈ పోటీ జూన్ 7 నుంచి జూలై 18వ తేదీ 2019 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, విజేతలకు ప్రతివారం బహుమతులు అందిస్తామని ప్యారడైజ్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. బిర్యానీ ప్రియులు ఈ నిర్ణీత సమయంలో ప్యారడైజ్ ఫుడ్ కోర్టుల డైన్ ఇన్/ఎక్స్‌ప్రెస్ ఔట్‌లెట్‌లకు కుటుంబం, స్నేహితులతో విచ్చేసి ఈ పోటీ గురించి వివరంగా తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ క్రికెట్ సీజన్ తమ వినియోగదారులకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈపోటీని తీసుకువచ్చినట్లు సంస్థ సీఈవో గౌతం గుప్తా తెలిపారు. ఇక ఐపీఎల్ సందర్భంగా ప్యారడైజ్ రెగ్యూలర్ కస్టమర్లకు ఉచితంగా బిర్యానీతో పాటు ఐపీఎల్ టికెట్లు అందజేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment