ఇంకా పురుషులకే అనుకూలం
పెద్దపెద్ద వంటలు కేవలం పురుషులు మాత్రమే చేయగలరు అనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు. ఎంతోమంది స్త్రీలు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. మన పురాణాలు పరిశీలిస్తే కూడా పెద్దపెద్ద వంటలు చేసినవారిలో నలుడు, భీముడు వంటి పురుష పాత్రలే కనిపిస్తాయి. పనిచేసే వాతావరణం పురుషులకే అనుకూలంగా ఉంటోంది. అందువల్ల స్త్రీలు చెఫ్ వృత్తి నుంచి తప్పుకుంటున్నారు. అలాగే పని కోసం అదనపు సమయం వెచ్చించడానికి ఆసక్తి చూప లేరు.
దేశాలలో అత్యధిక సంఖ్యలో మహిళలు చెఫ్‌లుగా రాణిస్తున్నారు. ఎక్కువ సమ యం నిలబడాల్సి రావడం, శారీరక శ్రమకు గురిచేసే పనులు... ఇలా మహిళలకు కొన్ని ప్రతికూల పరిస్థితులుఉన్నప్పటికీ... భవిష్యత్తులో ఈ రంగంలోకి మహిళలు బాగా వచ్చే అవకాశం ఉంది. నేను హైదరాబాద్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (హెచ్‌ఆర్) లో మాస్టర్స్ పూర్తి చేసి అమెరికా వెళ్లి ఐటి అనలిస్ట్‌గా పనిచేశాను. అక్కడే పలు రెస్టారెంట్స్‌లో చెఫ్‌గా పనిచేశాను. భారత్‌కు వచ్చాక, సొంత రెస్టారెంట్ ప్రారంభించాను.