Chef women
-
Nikitha Umesh: స్ట్రాంగ్‌గా ఉంటేనే మనుగడ
సాధారణంగా ఇళ్లలో ఆడవాళ్లే వంటలు చేస్తారు. వృత్తిపరంగా చూస్తే మగ చెఫ్‌లే ఎక్కువ కనిపిస్తారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న చెఫ్ నిఖితా ఉమేష్‌ను అడిగితే... ‘‘నేను చెఫ్‌గా ఈ వృత్తిని ఎంచుకోవాలనుకున్నప్పుడు ‘గిన్నెలు కడగడానికి వెళుతున్నావా’ అని వ్యంగ్యంగా అన్నవాళ్లే ఇప్పుడు నా వంటలు రుచి చూసి చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు’’ అని వివరించారు. మాస్టర్ చెఫ్ ఇండియా (తెలుగు) జ్యూరీ ప్యానెల్లో స్థానం దక్కించుకున్న నిఖిత ఉమేష్ ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘చదువుకునే రోజుల్లో టీవీలో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా చూసేదాన్ని. ఇంట్లో రకరకాల వంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ ఆసక్తితోనే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. దుబాయ్, సింగపూర్లలో శిక్షణ కోసం రెండేళ్లపాటు పనిచేశాను. పేస్ట్రీ ప్రొఫెషనల్ అండ్ మాస్టర్ చాకోలేటియర్గా హైదరాబాద్‌లో ఏడేళ్లు పని చేశాను. అలా హైదరాబాద్ పేస్ట్రీ చెఫ్‌గా, క్యుజిన్ డిజైనర్‌గా పేరొచ్చింది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో మావారితో కలిసి మూడు పేస్ట్రీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాను. ఏ రంగమైనా మనల్ని మనం నిత్యం నిరూపించుకుంటూనే ఉండాలి. అందులోనూ ఆహారం విషయానికి వస్తే మరీ ప్రత్యేకం. ఇంట్లో తిన్నవారు ఆ వంట రుచి చెప్పేంతవరకు వంట వండినవారు ఒక తెలియని ఒత్తిడిని పీలవుతుంటారు. అలాగే, మేం ప్రతి రోజూ మా పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎంతోమందికి చేరవవుతుంటాం. కాబట్టి, ఈ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. నైపుణ్యంతోపాటు రుచిగా అందించాలనే భావన కూడా మమ్మల్ని గెలిపిస్తుంటుంది. వర్క్ బాగుంటేనే... ఐటీసీ హోటల్స్‌లో చెఫ్‌గా వర్క్ చేసినప్పుడు నా వయసు 22 ఏళ్లే. టీమ్‌లో పద్దెనిమిది మంది చెఫ్స్ ఉండేవారు. అందరూ మగవాళ్లే. అందులో సీనియర్స్ కూడా ఉండేవారు. నా వర్క్ బాగుంటేనే వారందరూ నన్ను గౌరవిస్తారు. ఈ విషయంలో ఎప్పుడూ నేను అలర్ట్‌గా ఉండేదాన్ని. వారికి తగిన సూచనలు ఇస్తూ ఏడేళ్లు పనిచేశాను. ఈ వర్క్‌లో శారీరక శ్రమతో పాటు టైమ్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కుటుంబం కూడా సపోర్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. నిజానికి ఇళ్లలో వంటలు చేసేవాళ్లు ఆడవాళ్లే కానీ. హోటల్స్‌లో వృత్తిపరంగా చెఫ్‌లుగా ఉన్న మహిళల శాతం మాత్రం తక్కువగానే ఉంది. కొత్తగా నేర్చుకుంటూ.. నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. అమ్మ ప్రభ డిఫెన్స్‌లో సీనియర్ అడ్మిన్ ఆఫీసర్, నాన్న ఉమేష్ ఎల్ఐసీ రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. నేను కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు రాదు. మాస్టర్ చెఫ్ ఇండియా అవకాశం వచ్చాక తెలుగు నేర్చుకున్నాను. అందుకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. చెఫ్ కమ్యూనిటీ నుంచి ఎవరో నన్ను రికమండ్ చేసి ఉంటారు. ఆ విధంగా నాకు జ్యూరీలో సభ్యురాలిగా ఉండే అవకాశం లభించింది. పనిలో చూపించే శ్రద్ధ, తపన మనల్ని విజయమార్గంలో తప్పక నడిపిస్తుంది’’ అని వివరించారు ఈ మాస్టర్ చెఫ్. ఆమె అనుభవ పాఠాలు మరికొందరికి విజయ సోపానాలు అవుతాయి కదా... – నిర్మలారెడ్డి -
స్టార్ చెఫ్‌కు 'మిషెలాన్ స్టార్' అవార్డు
‘అబ్బో! ఇప్పుడు తినాలా!’ అని బద్దకించే వాళ్లను కూడా ఆవురావురుమంటూ తినేలా చేసింది ముంబైకి చెందిన గరీమా అరోరా. వంటల తత్వాన్ని ఒడిసిపట్టిన గరీమా చెఫ్, రెస్టారెంట్ నిర్వాహకురాలిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. తాజాగా... ‘మిషెలాన్ స్టార్’ అవార్డ్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా ప్రత్యేకత సాధించింది గరీమా అరోరా. ప్రపంచ వ్యాప్తంగా ‘ఔట్ స్టాండింగ్ కుకింగ్’కు సంబంధించి చెఫ్‌లకు ఇచ్చే ఫ్రాన్స్ దేశపు అత్యున్నత అవార్డ్ మిషెలాన్ స్టార్. నా సక్సెస్‌మంత్ర పురాణాల నుంచి చరిత్ర వరకు వంటలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటాను. మన భారతీయ పురాతన వంటకాల నుంచి ప్రేరణ పొందుతాను. సంప్రదాయ, ఆధునిక పద్ధతులను మిళితం చేస్తాను. స్థానికంగా దొరికే పదార్థాలను ఉపయోగిస్తాను. – గరీమా అరోరా గరీమా ఫుడ్ ఫిలాసఫీ ఏమిటీ? ‘వంటకం ఎలా ఉండాలంటే తినే వ్యక్తి చుట్టుపక్కల ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోవాలి. ఆస్వాదన మీద తప్ప మరే విషయం మీద దృష్టి మళ్లకూడదు’. కొత్త వంటకాలను రుచి చూడడం, కొత్త వం.టకాలు తయారు చేసి ఇతరులకు పరిచయం చేయడం అంటే గరీమాకు ఇష్టం. ఆ ఇష్టమే ‘చెఫ్’ అయ్యేలా చేసింది. గరీమాకు థాయిలాండ్‌లో ‘గా’ పేరుతో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. ఊహించని సమ్మేళనాలతో దినుసులు, రకరకాల వంటకాల ఘుమఘుమలతో అతిథులను ఆశ్చర్యపరచడంలో ‘గా’ ముందు ఉంటుంది. ‘ఏడు నెలల పిల్లాడిని చూసుకోవడం, బిజినెస్, కిచెన్ పనులను సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నా టీమ్‌ను నా శక్తిగా చెబుతాను. రకరకాల కస్టమర్లు, లేటునైట్లు. పని ఒత్తిడి ఉన్నా, నేను అందుబాటులో లేకపోయినా రెస్టారెంట్ సజావుగా సాగేలా చేస్తారు. వారి సపోర్ట్ లేకపోతే కుటుంబ బాధ్యతలు, వ్యాపార పనులను సమన్వయం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. మిషెలాన్ స్టార్ అవార్డ్ గెలుచుకోవడంలో తగిన సహాయ సహకారాలు అందించి టీమ్ నన్ను ముందుకు నడిపించింది. రెస్టారెంట్లో పనిచేయడం లేదా నిర్వహించడం అంత సులభం కాదు. ఎంతో అంకితభావం ఉండాలి. కష్టపడే తత్వం ఉండాలి. ఇంట్లో వాళ్లతో హాయిగా మాట్లాడానికి కూడా సమయం దొరకకపోవచ్చు. సెలవులు, పండగలు, ఫంక్షన్లు మిస్ కావచ్చు. అన్నిటినీ తట్టుకోగలిగితే ఎన్నో సాధించవచ్చు’ అంటున్న గరీమా అరోరా మరిన్ని పురస్కారాలు గెలుచుకోవాలని ఆశిద్దాం. ఇవి చదవండి: 'ఇండిగ్యాప్'తో ఆరోగ్యం, అధికాదాయం! -
దాల్చిని @ యాప్
మహిళలు ఆఫీసులలో పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. గొప్ప గొప్ప ప్రాజెక్టులను అవలీలగా క్లియర్ చేయవచ్చు. కానీ, వారు ఇంటికి తిరిగి రాగానే కుటుంబసభ్యుల నుంచి ‘తినడానికి ఏముంది?’ అనే సాధారణ ప్రశ్నను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఉదయం పనికి వెళ్ళే ముందు కూడా ఆ రోజుకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టి వెళుతుంటారు. వంట అనేది మహిళలకు ఓ పెద్ద సమస్య. దీనినే తన వ్యాపారానికి అవకాశంగా మలుచుకుంది ప్రేరణ. దాల్చిని పేరుతో మొబైల్ యాప్, ఐఓటి వెండింగ్ మెషిన్ల ద్వారా ఇంటి వంటను అందిస్తోంది. 2009లో ఐఎమ్‌టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో రజత పతకం సాధించిన ప్రేరణకు ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం మహిళలకు రోజువారీ వంట ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని దాల్చిని ద్వారా అందిస్తోంది ప్రేరణ. భార త సంప్రదాయ ఇళ్లలో వండిన ఆహారం కోసం ఏర్పాటు చేసిన భౌతిక మార్కెట్ ఇది. ఐఓటి ఆధారిత వెండింగ్ మెషిన్ల ద్వారా టిఫిన్ సేవల నెట్‌వర్క్‌నూ అందిస్తోంది. 36 ఏళ్ల ప్రేరణ మాట్లాడుతూ– ‘ఇంట్లో వండిన భారతీయ వంటకాలు, రొట్టెలు, స్నాక్స్ వంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంచే లక్ష్యంతో దాల్చిని ప్రారంభమైంది’ అని వివరించింది. వైవిధ్యమైన పాత్రలు వ్యాపారిగా, వృత్తి నిపుణురాలిగా, ఆరేళ్ల అమ్మాయికి తల్లిగా ప్రేరణ తన పని గంటల ప్రకారం సమయానుసారంగా కుటుంబసభ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఇబ్బందిని గుర్తించింది. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రేరణ... చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘పట్టణ వయోజన శ్రామిక జనాభాలో 69 శాతానికి పైగా పని కోసం బయల్దేరినవారికి ఇంట్లో వండిన ఆహారం లభించదు. హోమ్ టిఫిన్ సేవల్లో ప్రజలు మరింత రుచి, నాణ్యత, నమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే దాల్చిని ఏర్పాటయ్యింది’ అని వివరిస్తుంది ప్రేరణ. మహిళలే కీలకం ఐఓటీ వెండింగ్ మెషన్ దాల్చిని మెనూలో సోయా మసాలా క్రాకర్స్, మహారాష్ట్ర చివ్డా, మామ్ స్టైల్ అజ్వైని పరాఠా, హెల్తీ దాల్ పరాఠా, పార్సీ కేక్ రస్క్, గ్రీన్ బఠానీ మినీ సమోసా, గోబీ మంచూరియా, వెజిటబుల్ బిర్యానీ, మల్టీగ్రెయిన్ కుకీలు, సాస్‌తో వడాపావ్‌లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న తర్వాత, ఆర్డర్ ద్వారా చెల్లింపులు ఉంటాయి. యాప్ ద్వారా ‘ఆర్డర్లలో ముప్పై శాతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు స్వీకరిస్తాం. వ చ్చిన ఆర్డర్ల ప్రకారం ఆ ప్రాంతంలోని ఇంటి మహిళలకు సమాచారం చేరుతుంది. వారి ద్వారా సమయానుకూలంగా ఆర్డర్ చేసినవారికి వంటను అందిస్తాం. కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మహిళదే కీలకమైన బాధ్యత. పనిచేసే మహిళా నిపుణులకు ఇది సవాల్ లాంటిది. ఇతర వృత్తులలోని మహిళలకు వంట చేసే బాధ్యతను పంచుకునేందుకు తమ ఇంటి నుండి టిఫిన్ సేవలను నడుపుతున్నవారికి దాల్చిని అవకాశం కల్పిస్తుంది. ఇళ్లలోని మహిళా చెఫ్‌లకు అవకాశాలు కల్పించే మంచి యాప్ ఇది. తద్వారా వారు గుర్తింపును పొందుతున్నారు’ అని వివరిస్తుంది ప్రేరణ. -
ఇంకా పురుషులకే అనుకూలం
పెద్దపెద్ద వంటలు కేవలం పురుషులు మాత్రమే చేయగలరు అనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు. ఎంతోమంది స్త్రీలు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. మన పురాణాలు పరిశీలిస్తే కూడా పెద్దపెద్ద వంటలు చేసినవారిలో నలుడు, భీముడు వంటి పురుష పాత్రలే కనిపిస్తాయి. పనిచేసే వాతావరణం పురుషులకే అనుకూలంగా ఉంటోంది. అందువల్ల స్త్రీలు చెఫ్ వృత్తి నుంచి తప్పుకుంటున్నారు. అలాగే పని కోసం అదనపు సమయం వెచ్చించడానికి ఆసక్తి చూప లేరు. దేశాలలో అత్యధిక సంఖ్యలో మహిళలు చెఫ్‌లుగా రాణిస్తున్నారు. ఎక్కువ సమ యం నిలబడాల్సి రావడం, శారీరక శ్రమకు గురిచేసే పనులు... ఇలా మహిళలకు కొన్ని ప్రతికూల పరిస్థితులుఉన్నప్పటికీ... భవిష్యత్తులో ఈ రంగంలోకి మహిళలు బాగా వచ్చే అవకాశం ఉంది. నేను హైదరాబాద్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (హెచ్ఆర్) లో మాస్టర్స్ పూర్తి చేసి అమెరికా వెళ్లి ఐటి అనలిస్ట్‌గా పనిచేశాను. అక్కడే పలు రెస్టారెంట్స్‌లో చెఫ్‌గా పనిచేశాను. భారత్‌కు వచ్చాక, సొంత రెస్టారెంట్ ప్రారంభించాను.