పోలీసులకు సీసీఎస్ సీఐ ఫిర్యాదు
శాంపిల్ సేకరించని ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు
రసూల్‌పురా: కార్ఖానా పీఎస్ పరిధిలోని ఓ రెస్టారెంట్‌లో షవర్మ తిని అస్వస్థతకు గురైనట్లు సీసీఎస్ సీఐ వంశీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న రాత్రి సీఐ వంశీతో పాటు అతని డ్రైవర్ రెస్టారెంట్‌లో షవర్మ తిన్నారు. మర్నాడు ఆస్వస్థతకు గురైన సీఐ తాను షవర్మ కారణంగా తాను అనారోగ్యానికి గురైనట్లు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అదే రోజు స్విగ్గి, జొమాటో ద్వారా షవర్మ ఆర్డరు చేసినవారిలో ఎవరూ అస్వస్థతకు గురి కాలేదని తేలింది. దీంతో పోలీసులు ఫుడ్‌సెఫ్టీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు ఇప్పటివరకు సదరు రెస్టారెంట్‌లో షవర్మ శాంపిల్ సేకరించేందుకు రాలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment