
మెక్సికో నలభీములు..!
శనివారం మెక్సికో సిటీలోని చారిత్రక ఏంజెల్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్మారక స్తూపం వద్ద గుమిగూడిన వీరంతా చెఫ్‌లు. మొత్తం 3,634 మంది ఇలా ఒకే చోటికి చేరి కొత్త గిన్నిస్ రికార్డును సృష్టించారు. దుబాయిలో 2003లో 2,847 మంది చెఫ్‌లు ఒకే చోటికి చేరి సృష్టించిన రికార్డును వీరు బద్దలుకొట్టారు. అలాగే శనివారం మరో 337 మంది వెయిటర్లు కూడా ట్రేలలో డ్రింకులను పెట్టుకుని మెక్సికో సిటీలో 800 మీటర్ల రేసును పూర్తి చేసి మరో గిన్నిస్ రికార్డును తిరగరాశారు.