International organizations
-
ఆరు నగరాల్లో జీసీసీల జోరు
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌ను (జీసీసీ) ఏర్పాటు చేయడానికి ఆరు ప్రధాన నగరాల్లో అంతర్జాతీయ సంస్థలు 2022 నుండి 2024 జూన్ మధ్య సుమారు 53 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. వీటిలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై ఉన్నాయి. ఈ కాలంలో లీజుకు తీసుకున్న మొత్తం ఆఫీస్ స్పేస్‌లో బెంగళూరు ఏకంగా 40 శాతం వాటా కైవసం చేసుకుంది. హైదరాబాద్‌కు 21, చెన్నైకి 14 శాతం వాటా ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ, హైరింగ్ సొల్యూషన్స్ కంపెనీ జాయిన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జీసీసీలు ఇటీవలి కాలంలో తమ భారతీయ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాయి. నైపుణ్యం కలిగిన సిబ్బంది, తక్కువ వ్యయాలు, అనుకూల వ్యాపార వాతావరణం ఇందుకు కలిసి వచి్చంది. ఈ సెంటర్స్ వృద్ధి పథం భారత్‌లోని మొదటి ఆరు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంటుందని అంచనా. అసాధారణ ప్రతిభగల వ్యక్తులు వీటిని నడిపిస్తున్నారు. ఈ అంశం జీసీసీల విస్తరణ, భవిష్యత్తు అభివృద్ధికి వీలు కలి్పస్తుంది. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు తమ జీసీసీల కోసం పెద్ద ఎత్తున కార్యాలయ స్థలాలను సమకూర్చుకోవడం ద్వారా భారత్ పట్ల తమ దీర్ఘకాలిక నిబద్ధతను ధృవీకరిస్తున్నాయి. -
G20 Summit: ఐరాస భద్రతా మండలిని విస్తరించాలి: మోదీ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అన్ని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని చెప్పారు. ప్రపంచాన్ని భవ్యమైన భవిష్యత్తు దిశగా నడిపించడానికి ఆయా సంస్థలు ‘నూతన వాస్తవ పరిస్థితులను’ ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. కాలానుగుణంగా మార్పునకు లోనుకానివి సమకాలినతను కోల్పోతాయని అన్నారు. ఆదివారం ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘వన్ ఫ్యూచర్’ సెషన్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం సదస్సు ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థలు ఏవైనా సరే ఇప్పటి అవసరాలను తీర్చేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి ఏర్పాటైనప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని పేర్కొన్నారు. అప్పట్లో ఐరాసలో 51 సభ్యదేశాలు ఉండవని, ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు 200కు చేరిందని గుర్తుచేశారు. అందుకు తగ్గట్లుగా భద్రతా మండలిని కూడా విస్తరించాలని అన్నారు. ప్రపంచంలో ఎన్నో రంగాల్లో మార్పులు జరిగాయని, ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాల సంఖ్యల ఎలాంటి మార్పులు జరగలేదని ఆక్షేపించారు. ఐక్యరాజ్యసమితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతను వివరించారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరున జీ20 సదస్సును వర్చువల్‌గా నిర్వహించుకుందామని ప్రతిపాదించారు. ఇప్పటి సదస్సులో తీసుకున్న నిర్ణయాలతోపాటు ఇతర అంశాలపై మరోసారి సమీక్షిద్దామని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీల గురించి మోదీ ప్రస్తావించారు. వర్తమానాన్ని, భవిష్యత్తును ఇవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. క్రిప్టో కరెన్సీలను రెగ్యులేట్ చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాదులు నిధులు సమకూర్చుకోవానికి సైబర్‌స్పేస్ అనేది ఒక కొత్త వనరుగా ఆవిర్భవించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కఠిన చర్యలు చేపట్టాలని, ప్రపంచదేశాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు. మానవ కేంద్రిత అభివృద్ధి జీడీపీ కేంద్రిత ప్రయాణానికి కాలం చెల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మానవ కేంద్రిత అభివృద్ధి ప్రయాణం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఈ దిశగా తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ)ను సామాజిక–ఆర్థిక ప్రగతికి ఉపయోగించాలని అన్నారు. -
ప్రపంచ సంస్థలపై డ్రాగన్ పట్టు
ఒక రాజ్యంపై పట్టు సాధించడం కన్నా, అన్ని రాజ్యాలపై ప్రభావం చూపే సంస్థపై పట్టు సాధిస్తే? సరిగ్గా చైనా ఇదే సూత్రాన్ని అవలంబిస్తోంది. దీనివల్ల తాను ఆడించినట్లు ప్రపంచాన్ని ఆడించవచ్చని చైనా అధినాయకత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పటికే కొంతమేర సఫలమయ్యాయని వివిధ నివేదికలు చెబుతున్నాయి. అదేంటో చూద్దాం! ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థలపై పట్టుకోసం చైనా యత్నిస్తోందని, దీనిద్వారా స్వీయ ప్రయోజనాలు పొందాలని చైనా ఆశిస్తోందని ఆశ్చర్యకరమైన అంశాలు బయటకొచ్చాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లను ఏవిధంగా చైనా కబ్జా చేసేందుకు యత్నిస్తోందో బ్రిటన్‌కు చెందిన పార్లమెంటరీ ఫారెన్ అఫైర్స్ కమిటీ నివేదిక వివరించగా, పలు ఐరాస ఏజెన్సీల్లో చైనా పౌరులు కీలక స్థానాల్లో ఉన్నట్లు గేట్‌వే హౌస్ నివేదిక తెలిపింది. కీలకమైన స్థానాల్లో పాగా వేయడం, ఇందుకోసం సామ, భేద, దానోపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రపంచ సంస్థలపై చైనా పట్టుజిక్కించుకుంటోందన్న అనుమానాలను ఈ నివేదికలు బలపరుస్తున్నాయి. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆ సంస్థల స్థాపక నియమావళికి వ్యతిరేకమే కాక, చైనాకు అవి ఆయుధాలుగా మారతాయనే ఆందోళనలు పెరిగాయి. ఆరింటిపై కన్ను ప్రపంచ దేశాల్లో చాలావాటికి సభ్యత్వాలున్న కీలకమైన అరడజను సంస్థలపై బ్రిటన్‌కు చెందిన 11 మంది ఎంపీలు తయారు చేసిన నివేదిక దృష్టి సారించింది. ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్‌పోల్, అంతర్జాతీయ మానవ హక్కుల హైకమిషనర్ ఆఫీసు(ఓహెచ్సీహెచ్ఆర్)లాంటి ముఖ్యమైన సంస్థల్లో చైనా ప్రాముఖ్యత పెరుగుతున్న తీరును వివరించింది. ఇందుకు పలు ఉదాహరణలు సైతం ఉన్నాయని తెలిపింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)లో నైన్త్ డీజీ కోసం 2019లో జరిగిన ఎన్నికలను నివేదిక ఉదహరించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమకు కామెరూన్ దేశం నుంచి రావాల్సిన 7.8 కోట్ల డాలర్ల అప్పును చైనా మాఫీ చేసింది. అనంతరం నైన్త్ డీజీ పదవికి పోటీ నుంచి కామెరూన్ అభ్యర్థి తప్పుకున్నారు, దీంతో చైనా అభ్యర్థికి ఈ పోస్టు దక్కింది. ప్రస్తుతం ఐరాసకు చెందిన 15 విభాగాల్లో నాలిగింటికి(ఎఫ్ఏఓ, ఐటీయూ, ఐసీఏఓ, ఐడీఓ) చైనావాళ్లే అధిపతులుగా ఉన్నారని, వేరే ఏ దేశానికి చెందిన వారు ఒక్క విభాగానికి మించి అధిపతులుగా లేరని వివరించింది. 2019లో డబ్ల్యూఐపీఓను కూడా చైనా చేజిక్కించుకునేదే కానీ చివరి నిమిషంలో అమెరికా అడ్డంపడింది. డబ్బుతో కొనేస్తుంది కీలక ఆర్గనైజేషన్లను చేజిక్కించుకోవడంలో చైనా ఎక్కువగా నిధులు, ఆర్థిక సాయం మార్గాన్ని ఎంచుకుంటోంది. సాధారణంగా ఇలాంటి సంస్థలకు ఆయా దేశాలు వాటి ఆర్థిక స్థితిని బట్టి నిధులు ఇస్తాయి. ఇదికాకుండా లక్ష్యసాధన కోసం వీటికి వివిధ దేశాలు విరాళాలు ఇస్తుంటాయి. చైనా దీన్ని తనకు అనువుగా మలచుకుంటోందని గేట్‌వే నివేదిక చెబుతోంది. 2010–19 కాలంలో చైనా చేసే స్వచ్ఛంద విరాళాలు 346 శాతం పెరిగాయి. దీంతో ఐరాస సంస్థలు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు నిధులు లభించినట్లవుతుంది, ఎక్కువగా విరాళమిచ్చినందుకు సాధారణంగానే చైనా చెప్పినట్లు ఈ ప్రాజెక్టులు ప్రభావితమవుతుంటాయి. నిజానికి యూఎస్ తదితర దేశాలిచ్చే నిధులతో పోలిస్తే చైనా ఇచ్చేది తక్కువే కానీ తక్కువ ఇచ్చి ఎక్కువ ప్రభావం చూపడం చైనా విధానమని ఒక మాజీ అధికారి వివరించారు. అలాగే కొన్నిమార్లు కొన్ని ఆయాచితంగా కలిసివచ్చి సంస్థలపై చైనా పట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంటాయి. ఉదాహరణకు డబ్ల్యూహెచ్ఓకు ట్రంప్ ప్రభుత్వం నిధులు తగ్గించగానే, ఆపన్న హస్తం చాచినంత ఫోజుకొట్టి చైనా కొంతమేర నిధులిచ్చి పట్టు పెంచుకుంది. బైడెన్ ఈ పరిస్థితిని చక్కదిద్దే పనులు చేపట్టారు కానీ పోయిన పట్టు తిరిగి రాలేదని నిపుణులు తెలిపారు. అలాగే ఇంటర్‌పోల్‌లో చైనా తక్కువ నిధులిచ్చినా ఎక్కువ ప్రభావం చూపే స్థితిలో ఉంది. దీంతో పలు దేశాలకు చెందిన నేరçస్తులపై జారీ చేసే రెడ్‌కార్నర్ నోటీసులను ప్రభావితం చేయగలదని చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌పై సైతం పట్టు పెంచుకోవాలని చైనా యత్నిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థల్లో టాప్–3 స్థాయిలో చైనా ఉంది. ఇప్పటికైతే ఈ రెండిటిపై యూఎస్, ఈయూ పట్టు చాలా గట్టిగా ఉందని గేట్‌వే నివేదిక తెలిపింది. పరోక్షంగా కూడా ప్రభావం కొన్ని సంస్థల్లోని కీలక పదవిలో చైనీయులు లేకున్నా, ఇప్పుడున్నవారి ద్వారా చైనా పలు విధాలుగా పరోక్ష లబ్ది పొందుతోందని గేట్‌వే నివేదిక తెలిపింది. ఉదాహరణకు డబ్లు్యహెచ్‌ఓ అధ్యక్షుడైన టెడ్రోస్ చైనీయుడు కాదు. కానీ ఆయన ఎన్నికకు చైనా 2017లో మద్దతిచ్చింది. అంతకుముందు ఆయన ఇథియోపియా మంత్రిగా పనిచేశారు. ఆఫ్రికాకు చెందిన ఈ దేశంలో అత్యధికంగా చైనా పెట్టుబడులు పెట్టింది. అంతకుముందు ఈ సంస్థకు పదేళ్ల పాటు అధ్యక్షత వహించిన మార్గరెట్ ఛాన్ హాంకాంగ్‌కు చెందినవారు. దీంతో డబ్లు్యహెచ్‌ఓ నుంచి చైనాకు ఎంతగా మద్దతు వస్తుందో అవగతమవుతోందని నివేదికలు తెలిపాయి. కొన్ని సంస్థల్లో పట్టు కోసం కొన్నిదేశాలపై చైనా దౌర్జన్యపూరిత డిప్లమసీ మార్గాన్ని ఎంచుకుంటుందని తెలిపాయి. -
విదేశీ ఎంబసీలకూ జీఎస్టీ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయింపు పొందేందుకు విదేశీ ఎంబసీలు, అంతర్జాతీయ సంస్థలు రిజిస్టర్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సంబంధిత సంస్థ ప్రతినిధి డిజిటల్ సంతకంతో దరఖాస్తు చేసుకుంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) జారీ చేస్తామని, దాని ఆధారంగా అతిథి హోదాలో జీఎస్టీ నుంచి మినహాయింపు పొంద వచ్చని పన్నుల శాఖ స్పష్టం చేసింది. ఇక ఎవరైనా డీలర్‌కు లభించే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదరు డీలర్ కట్టిన పన్ను కన్నా ఎక్కువ వస్తే ఆ మొత్తాన్ని డీలర్ ఖాతా నుంచి మినహాయించుకోవాలని పేర్కొంది. కొనుగోలు సమయంలోనే.. విదేశీ ఎంబసీల్లో పనిచేసే విదేశీ ఉద్యోగులు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతి నిధులను మనదేశ అతిథులుగా భావించి.. వారు కొనుగోలు చేసే వస్తువులపై పన్ను మినహాయింపు ఇస్తారు. అయితే విదేశాలకు చెందిన సాధారణ పౌరులు, పర్యాటకం కోసం వచ్చేవారికి ఇది వర్తించదు. ఎంబసీలు, ఇతర అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు మాత్రం వర్తిస్తుం ది. గతంలో వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు ఆయా సంస్థల కు చెందిన వ్యక్తులు లేదా సంస్థలు చేసే కొనుగోళ్లు, అందించే సేవలపై పన్ను విధించే వారు. తర్వాత వారు క్లెయిమ్ చేసుకుంటే.. పన్ను తిరిగి అందజేసేవారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ పన్ను మినహాయింపును కొను గోలు, సేవల సమయంలోనే ఇవ్వాలని చట్టం లో పేర్కొన్నారు. ఇందుకోసం వారు నిర్దే శిత రూపంలో దరఖాస్తులను డిజిటల్ సంతకంతో సమర్పిస్తే యూఐఎన్ జారీ చేస్తారు. ఏవైనా వస్తు, సేవలు పొందేటప్పుడు ఈ నంబర్‌ను డీలర్‌కు ఇస్తే బిల్లులోనే పన్ను మినహాయింపు వస్తుంది. ఇందుకు కేవలం డిజిటల్ సంతకం సరిపోతుందని. వారికి పాన్, ఆధార్ వంటివేవీ అవసరం లేదని పన్నుల శాఖ తెలిపింది. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌పై స్పష్టత రిజిస్టర్ చేసుకున్న డీలర్లకు లభించే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) విషయంలోనూ పన్నుల శాఖ స్పష్టత ఇచ్చింది. డీలర్లకు లభించే ట్యాక్స్ క్రెడిట్ మొత్తం జీఎస్టీఆర్–3 కన్నా జీఎస్టీఆర్–3 బీలో ఎక్కువ వస్తే ఆ మొత్తాన్ని డీలర్ ఖాతాకు జమచేయాలని.. తక్కువ వస్తే ఆ డీలర్ ఖాతా నుంచి మినహాయించుకోవాలంది. -
‘డబుల్’కు విదేశీ నిధులు
♦ ఆసక్తి కనబరిచిన అంతర్జాతీయ సంస్థలు ♦ ఖర్చు తగ్గించే అంశంపై వర్క్‌షాపు సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం పథకంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. వీలైతే ఇక్కడి బ్యాంకుల వడ్డీ కంటే తక్కువకే నిధులు సమకూర్చేందుకు సిద్ధమయ్యాయి. పెట్టుబడితోపాటు వాటి నిర్మాణ బాధ్యతను కూడా తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించాయి. తక్కువ ఖర్చుతో వాటిని నిర్మించేందుకు ఉన్న ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ఇతర ఖర్చు నియంత్రణ మార్గాలపై సూచనలు, సలహాల కోసం ప్రభుత్వం దేశవిదేశీ సంస్థలతో బుధవారం ఇక్కడ వర్క్‌షాపు నిర్వహించింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. అమెరికాకు చెందిన నెక్ట్స్ వాల్ కంపెనీ, జర్మనీకి చెందిన జీఐపీ ఎల్సీసీఈ సొల్యూషన్స్, బెల్జియంకు చెందిన సిస్మో సంస్థలు తాము ఆ పథకాన్ని చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించాయి. రుణాన్ని తిరిగి చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి 8 నుంచి 12 సంవత్సరాల గడువు ఇవ్వనున్నట్టు తెలిపాయి. అయితే ఎంత వడ్డీ విధిస్తామనే విషయాన్ని చర్చల సందర్భంగా ప్రకటిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. కర్ణాటక కంపెనీ ఆసక్తి... కర్ణాటకలో పేదల ఇళ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న గరుడ నిర్మాణ సంస్థ కూడా ‘డబుల్’ పథకంపై ఆసక్తి చూపింది. అయితే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న యూనిట్ కాస్ట్‌ను కొంత పెంచాల్సి ఉంటుందని సూచించింది. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ మినహాయిస్తే ఖర్చు భారీగా తగ్గుతుందని మరికొందరు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇంటి పూర్తి డిజైన్‌ను సిద్ధం చేయకపోవటం వల్ల కాంట్రాక్టర్లకు స్పష్టత ఉండటం లేదని కొందరు ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు. కనిష్టంగా 50 ఇళ్లు ఒక చోట ఉంటేనే ఖర్చు అదుపులో ఉంటుందన్నారు. హెచ్ఎండీఏ తరహాలో కొంత స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునే వెసులుబాటు కల్పిస్తే తాము సిద్ధమని కొందరు బిల్డర్లు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం యూనిట్ కాస్ట్ పెంచాలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. సీఎంకు నివేదిస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి ఈ వర్క్‌షాపులో వచ్చిన అభిప్రాయాలను ముఖ్యమంత్రికి నివేదించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీలైనంత తక్కువ ఖర్చులో అనుకున్న తరహాలో ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. -
లైకోస్, అపోలో ఇంటర్నేషనల్‌ల ఈ-కామర్స్ వెంచర్
హైదరాబాద్: ఇంటర్నెట్ బ్రాండ్ లైకోస్, అపోలో ఇంటర్నేషనల్ సంస్థలు ఈ-కామర్స్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. అపోలో లైకోస్ నెట్కామర్స్ పేరుతో ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటవుతోంది. భారత వినియోగదారులు లక్ష్యంగా కస్టమ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్ ఏర్పాటు చేయడానికి గ్లోబల్ బ్రాండ్స్‌కు ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్స్ ఈ వెంచర్ అంది స్తుంది. భారత వినియోగదారులకు వినూత్నమైన డిజిటల్ షాపింగ్ అనుభూతిని ఈ జాయిం ట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తెస్తామని అపోలో వైస్-చైర్మన్, ఎండీ రాజా కన్వర్ చెప్పారు. అంతర్జాతీయ దిగ్గజం బ్రాండ్లు భారత్‌లోకి ప్రవేశించడానికి వినూత్నమైన సర్వీసులందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లైకోస్ చైర్మన్, సీఈఓ సురేశ్ రెడ్డి చెప్పారు.