
సాక్షి, తిరుపతి : జ్ఞానభేరీ సభలో విద్యార్థుల అక్రమ అరెస్టులకు నిరసనగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆదివారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న జ్ఞానభేరి సభ రసాభాసంగా మారిన సంగతి తెలిసిందే. విద్యార్థులు ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిమాణాలతో సభ అంతా గందరగోళంగా మారింది. నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment