తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కు కారణమైన విద్యార్థులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన యూనివర్సిటీ వీసీ ని ఆదేశించారు.
కాగా ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్కు సంబంధించి ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమైంది. డీ బ్లాకుకు చేరుకుని విచారణ జరిపిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించారు.