mca students
-
చదివేది ఎంసీఏ.. చేసేది చైన్‌స్నాచింగ్
ధర్మవరం అర్బన్: ఉన్నత చదువులు చదివిన ఇద్దరు యువకులు చెడువ్యసనాలకు బానిసయ్యారు. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం చైన్‌స్నాచర్లుగా మారారు. బాధితుల బంధువుల చేతికి చిక్కి.. కటకటాలపాలయ్యారు. ఇద్దరు చైన్స్నాచర్లను ధర్మవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం పట్టణ పోలీసుస్టేషన్లో సీఐ హరినాథ్ మీడియాకు వెల్లడించారు. అనంతపురానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి, ఖాజామోద్దీన్‌లు ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ చదువుతున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ యువకులు కళాశాలకు వెళ్లకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా రూ.2 లక్షలు విలువ చేసే ద్విచక్రవాహనంలో అక్టోబర్ 21న ధర్మవరం వచ్చారు. పట్టణంలో వెళుతున్న రేగాటిపల్లి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే వివాహిత మెడలో బంగారు తాళిబొట్టు, గొలుసును లాక్కెళ్లారు. అప్రమత్తమైన బాధితురాలు బంధువులకు సమాచారం చేరవేసింది. బైక్‌పై దూసుకెళుతున్న ఆ యువకులను కేతిరెడ్డి కాలనీ సమీపంలో బాధితురాలు బంధువులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చైన్ స్నాచర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ జయానాయక్, హెడ్‌కానిస్టేబుల్ డోనాసింగ్, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, షాకీర్‌హుస్సేన్, ప్రసాద్, శ్రీరాములు పాల్గొన్నారు. -
ఎస్వీయూ ఘటనపై గంటా ఆగ్రహం
విశాఖ: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కు కారణమైన విద్యార్థులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన యూనివర్సిటీ వీసీ ని ఆదేశించారు. కాగా ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్‌కు సంబంధించి ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమైంది. డీ బ్లాకుకు చేరుకుని విచారణ జరిపిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించారు. -
ఎస్వీయూలో ర్యాగింగ్: ముగ్గురిపై చర్యలు!
-
ఎస్వీయూలో ర్యాగింగ్: ముగ్గురిపై చర్యలు!
తిరుపతి : ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్‌కు సంబంధించి ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమైంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశంపై 'సాక్షి' దినపత్రిలో... సోమవారం నుంచి సినిమా చూపిస్తాం అన్న శీర్షికపై కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించారు. డి బ్లాక్ వసతి గృహం వద్ద ఎంసీఏ జూనియర్లను...సీనియర్లు వేధించి...చొక్కాలు విప్పి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయటంతో జూనియర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఆదివారం మధ్యాహ్న సమయంలో రెక్టార్ జయశంకర్, ప్రిన్సిపాల్ భగవాన్ రెడ్డి, డెప్యూటీ వార్డన్ రమేష్ బాబు తదితరులు డి బ్లాక్ సందర్శించారు. ఘటనపై విద్యార్థులను విచారణ జరిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.