ఎస్వీయూలో ర్యాగింగ్: ముగ్గురిపై చర్యలు! | Ragging rears its head in SVU; 3 students held! | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో ర్యాగింగ్: ముగ్గురిపై చర్యలు!

Published Mon, Aug 17 2015 9:29 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

Ragging rears its head in SVU; 3 students held!

తిరుపతి : ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్కు సంబంధించి ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమైంది.  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశంపై 'సాక్షి' దినపత్రిలో... సోమవారం నుంచి సినిమా చూపిస్తాం అన్న శీర్షికపై కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించారు.  డి బ్లాక్ వసతి గృహం వద్ద ఎంసీఏ జూనియర్లను...సీనియర్లు వేధించి...చొక్కాలు విప్పి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయటంతో జూనియర్లు భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై ఆదివారం మధ్యాహ్న సమయంలో రెక్టార్ జయశంకర్, ప్రిన్సిపాల్ భగవాన్ రెడ్డి, డెప్యూటీ వార్డన్ రమేష్ బాబు తదితరులు డి బ్లాక్ సందర్శించారు. ఘటనపై విద్యార్థులను విచారణ జరిపారు. ర్యాగింగ్కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement