తిరుపతి: శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ)లో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఇంఛార్జ్ వీసీ రాజగోపాల్ యూనివర్శిటీ అధికారులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన సదరు విద్యార్థులను హాస్టల్, కాలేజీల నుంచి పంపించి వేస్తున్నట్లు వీసీ ప్రకటించారు.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశంపై 'సాక్షి' దినపత్రిలో... 'సోమవారం నుంచి సినిమా చూపిస్తాం' అన్న శీర్షికపై కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించి విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. డి బ్లాక్ వసతి గృహం వద్ద ఎంసీఏ జూనియర్లను.. .సీనియర్లు వేధించి...చొక్కాలు విప్పి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయటంతో జూనియర్లు భయాందోళనకు గురయ్యారు.
సాక్షి ఎఫెక్ట్:ఏడుగురు విద్యార్థుల సస్పెండ్
Published Tue, Aug 18 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement