ఎస్వీయూలో డ్రగ్స్‌ కలకలం | BTech students using drugs in SVU tirupati? | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో డ్రగ్స్‌ కలకలం

Published Tue, Apr 18 2017 8:41 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

ఎస్వీయూలో డ్రగ్స్‌ కలకలం - Sakshi

ఎస్వీయూలో డ్రగ్స్‌ కలకలం

హుక్కా మాత్రమే అంటున్న పోలీసులు
తిరుపతి: ఎస్వీయూలో డ్రగ్స్‌ కలకలం రేగింది.  సోమవారం రాత్రి పొద్దుపోయాక విశ్వతేజ బ్లాక్‌లోని 3303 గదిలో బీటెక్‌ విద్యార్థులు మత్తు పదార్థాలు తీసుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ప్రిన్సిపాల్‌ మల్లికార్జున, వార్డెన్‌ ప్రభాకర్‌లు వసతి గృహానికి వెళ్లి తనిఖీ చేయగా అక్కడ మత్తు పదార్థాలు గుర్తించినట్లు తెలిసింది. అనంతరం  విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వసతి గృహాన్ని తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులు డ్రగ్స్‌ తీసుకోవడానికి ఉపయోగించే పరికరాలను గుర్తించారు. వాటిని స్వాధినం చేసుకున్నారు. అయితే ఈ సంఘటనపై సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ అవి డ్రగ్స్‌ కాదని, విద్యార్థులు హుక్కా మాత్రమే తీసుకుంటు కనిపించారని పేర్కొన్నారు. అది పొగాకు మాత్రమే అని, డ్రగ్స్‌ కాదన్నారు.
 
గత వారం ర్యాగింగ్‌
ఎస్వీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం ర్యాగింగ్‌ కలకలం ఏర్పడింది. హెచ్‌బ్లాక్‌ సమీపంలో సీనియర్, జూనియర్‌ విద్యార్థులు కలసి గెట్‌టుగెదర్‌ చేసుకుండగా, ర్యాగింగ్‌ జరుగుతోందని ప్రచారం కావడంతో వార్డెన్‌ ప్రభాకర్‌ సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులను అక్కడ నుంచి పంపించి వేశారు. ఈ సంఘటన మరవక ముందే మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగడం విశేషం. ఈ సంఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లికార్జున  వివరణ కోసం ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement