
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల వాయిదా
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ఐసెట్ ఫలితాల విడుదల మధ్యాహ్నానికి వాయిదా పడింది. మంత్రి గంటా శ్రీనివాసరావు రావటం ఆలస్యం కావటంతో ఫలితాల విడుదలను అధికారులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే తిరుపతి ఎస్వీయూలో ఇవాళ ఉదయం 9 గంటలకు ఐసెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష ఐసెట్ 2016ను ఈ ఏఆడాది ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించింది. ఈ నెల 16న ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.