సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 20న ఏపీ సెట్ నిర్వహిస్తున్నామని ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి మీడియాకు వెల్లడించారు. యూజీసీ అనుమతితో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల కోసం ఏపీ సెట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి పదిన్నర గంటల వరుకు, పేపర్-2 ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరుకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం-1లో 50 ప్రశ్నలకు వంద మార్కులు, ప్రశ్నాపత్రం-2లో వంద ప్రశ్నలకు రెండు వందల మార్కులు ఉంటాయని వీసీ చెప్పారు.
విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రసాదరెడ్డి తెలిపారు. ఏపీ సెట్‌కు 34,020 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. విశాఖ రీజియన్‌లో అత్యధికంగా 7805 మంది హాజరవుతున్నారన్నారు. పరీక్ష హాలులోకి సెల్‌ఫోన్లు అనుమతి లేదని.. తీసుకొస్తే కేసులు నమోదు చేస్తామని వీసీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment