అంతర్జాతీయ హాస్టల్ సిద్ధం
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన అధునాతన హాస్టల్‌ను వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం సదర్శించారు. ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందింరానికి చేరువలో నిర్మాంణం పూర్తిచేసుకున్న భవనాన్ని పరిశీలించారు. పూర్తిస్థాయిలో పనులు ముగించి వచ్చే నెలలో విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సూచించారు.విభిన్న దేశాల నుంచి ఏయూలో విద్యను అభ్యశించే విద్యార్థుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోదన్నారు. దీనికి అనుగుణంగా అదనపు హాస్టల్స్‌ను నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఏయూ విద్యార్థులకు మరిన్ని హాస్టల్స్‌ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, విజయనిర్మాణ్ కంపెనీ అధినేత విజయకుమార్,చీఫ్ ఇంజనీర్ మాధవబాబు, పిఆర్‌ఓ ఎన్.వి.వి.ఎస్‌ఎస్ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.