ఆశలన్నీ నోటిఫికేషన్‌పైనే!
దీర్ఘకాలంగా వర్సిటీలో అధ్యాపక ఉద్యోగాల భర్తీపై నెలకొన్న సందిగ్ధతకు నేటితో తెరపడనుంది. 2006 నుంచి తొమ్మిదేళ్లుగా పెద్దసంఖ్యలో ఆశావహులు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అనే ఆశతో ఎదురుచూస్తుండగా..బుధవారం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో జరగనున్న ఉపకులపతుల సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే కనిపిస్తోంది.
-
ఆచార్యుల పోస్టుల భర్తీౖకి అర్హత పరీక్ష
-
నేటి సమావేశంలో స్పష్టత
-
వర్సిటీ మొక్కలకు జియోట్యాగింగ్
ఏయూక్యాంపస్: ఇటీవల అనంతపురంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో ఖాళీల భర్తీపై వర్సిటీల వీసీలు ఒక నిర్దిష్ట ఆలోచనకు వచ్చారు. అసోసియేట్ ఫ్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాలను పాత విధానంలో భర్తీ చేయడానికి నిర్ణయించారు. వీటి నియామకం ప్రక్రియ ప్రభుత్వ నియమావళిని అనుసరించి ఆయా వర్సిటీలే స్వయంగా చేపడతాయి. అయితే ఏవైనా అభ్యంతరాలను లేవనెత్తి.. ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కితే పోస్టుల భర్తీలో జాప్యం జరగకుండా.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక ఎంసెట్, ఐసెట్ తరహాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అర్హత పరీక్ష నిర్వహించి తద్వారా పోస్టులు భర్తీ చేయాలన్న అంశంపై ఉపకులపతులు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి దష్టికి తీసుకెళ్లారు. నేడు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై ఏ విధంగా స్పందిస్తారనే విషయంపైనే అమలు ఆధారపడి ఉంది. ఒకవేళ్ల ముఖ్యమంత్రి ఏపీపీఎస్సీకి నియామక బాధ్యత అప్పగిస్తే వీసీలు నిమ్మకుండిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇదే జరిగితే వర్సిటీలకు ప్రాధాన్యత తగ్గి, కేవలం నామమాత్రంగానే మిగిలిపోవడం ఖాయం!
మొక్కలకు జియో ట్యాగింగ్
వర్సిటీలో నాటే ప్రతి మొక్కను సంరక్షించే దిశగా జియోట్యాగింగ్ చేయనునున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఉపకులపతుల సమావేశంలో ప్రస్తావించనున్నట్లు భోగట్టా. తద్వారా ప్రతినెలా మొక్కల సంరక్షణ వివరాలను ముఖ్యమంత్రి డాష్ బోర్డ్‌కుకు సమాచారం చేరవేసే అవకాశం ఉంది.