ఏయూలో వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీ ప్రతినిధులు | Representatives of the University of Western Sydney in au | Sakshi
Sakshi News home page

ఏయూలో వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీ ప్రతినిధులు

Published Fri, Sep 2 2016 5:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

ఏయూలో వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీ ప్రతినిధులు

ఏయూలో వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీ ప్రతినిధులు

ఏయూక్యాంపస్‌ : ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్‌ సిడ్నీవర్సిటీ ప్రతినిధులు శుక్రవారం ఉదయం సందర్శించారు. వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు, ఇతర అధికారులు ప్రతినిధి బందం సమావేశమైంది. ఈ సందర్భంగా వీసీ నాగేశ్వరరావు ఏయూ స్వరూపం, కళాశాలలు, కోర్సులు వంటి అంశాలను వివరించారు. ఏయూ ఇప్పటికే అమెరికా, బ్రిటన్, సింగపూర్‌ దేశాలకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో సంయుక్తంగా పనిచేస్తోందని గుర్తుచేశారు. వర్సిటీ సామర్ధ్యాలు, విశిష్టతను తెలియజేశారు. వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీ ఎంటర్‌ ప్యూనర్‌షిప్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గ్రీమీ సాల్టర్‌ మాట్లాడుతూ పరిశోధన ప్రధానంగా సేవలను అందించడం జరుగుతోందన్నారు. పరిశ్రమల అవసరాలను గుర్తించి కోర్సుల రూపకల్పన చేస్తామన్నారు. ఎంటర్‌ప్యూనర్‌షిప్‌లో బ్యాచులర్‌ డిగ్రీ కోర్సును నిర్వహిస్తున్నామన్నారు.
వర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.సురేంద్ర మాట్లాడుతూ సాంకేతికత ఆధారితంగా బోధన నిర్వహించడం జరుగుతుందన్నారు. సంయుక్తంగా పనిచేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు. పరిశ్రమలను దష్టిలో ఉంచుకుని కోర్సులను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి కేంద్రంగా తమ విశ్వవిద్యాలయం పనిచేస్తుందన్నారు. స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్, జియో ఇంజనీరింగ్‌ వంటి కోర్సులను తమ విశ్వవిద్యాలయం అందించడం జరుగుతోందన్నారు. ఆర్కిటెక్చర్‌ కోర్సులను రానున్న విద్యా సంవత్సరం నుంచి తమ విశ్వవిద్యాలయంలో అందించే ఆలోచన ఉందన్నారు.వెస్ట్రన్‌ సిడ్నీ వర్సిటీ సీనియర్‌ రీజినల్‌ మేనేజర్‌జూలియా షెల్లీ మాట్లాడుతూ 26 సంవత్సరాల క్రితం ప్రారంభించిన తమ వర్సిటీకి అనుసంధానంగా ఏడు కళాశాలల్లో 45 వేలమంది విద్యార్థులు విద్యను అభ్యశిస్తున్నారన్నారు. ఆవిష్కరణ రంగంలో విస్తత అవకాశాలు లభిస్తున్నాయని, సుస్థిర భాగస్వామి కోసం అన్వేషిస్తున్నామన్నారు. సాంస్కతిక వైవిద్య కలిగిన విశ్వవిద్యాలయంలో తమదొకటన్నారు.
కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహరాల డీన్‌ ఆచార్య బి.మోహన వెంకట రామ్, ప్రిన్సిపాల్స్‌ సి.వి రామన్, కె.గీయత్రీ దేవి, డి.గౌరీ శంకర్, పి.ఎస్‌ అవధాని, కె.వైశాఖ్, ఆచార్య ఎం.ఎస్‌ ప్రసాదబాబు, విభాగాధిపతులు పాల్గొన్నారు. అనంతరం విదేశీ ప్రతినిధులను వీసీ నాగేశ్వరరావు సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement