ఏయూ వెబ్‌సైట్ హ్యాకింగ్
ఏయూ వెబ్‌సైట్ హ్యాకింగ్
Published Sat, Jul 30 2016 9:43 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురయింది. ఉదయం www.andhrauniveristy.edu.inవెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాకింగ్ చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. వెబ్‌సైట్‌ను సరిచేసే పనిలో పడ్డారు. మధ్యాహ్నం నాటికి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. దీనితో కొద్దిసేపు గందరగోళ వాతావరనం నెలకొంది. గతంలో రెండు పర్యాయములు ఏయూ వెబ్‌సైట్ హ్యకింగ్‌కు గురయింది. ఇంత జరుగుతున్న వర్సిటీ వెబ్‌సైట్‌ను పటిష్ట పరిచే దిశగా చర్యలు చేపట్టడం లేదు. పటిష్టమైన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ విభాగం, ప్రత్యేక కంప్యూటర్ సెంటర్, నిపుణులైన సిబ్బందిని కలిగిన ఉన్న ఏయూ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురవడం ఆశ్యర్యానికి గురిచేస్తోంది. వెబ్‌సైట్‌ను మరింత పటిష్ట పరచే దిశగా పనిచేయాలని వర్సిటీ ఆచార్యులు, విద్యార్థులు కోరుతున్నారు. వెబ్‌సైట్ హ్యాకింగ్ జరగలేదని, డొమైన్‌ను ఇతరులు డైవర్ట్ చేశారని ఉదయాన్నే తమకు తెలిసిన వెంటనే సమస్యను సరిచేశామని వెబ్‌సైట్ నిర్వాహకుడు ఆవాల రమేష్ తెలిపారు.
Advertisement