
విశాఖ : ఏపీ సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 26 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరి అభ్యర్ధులకు రూ.1000, బీసీ కేటగిరి అభ్యర్ధులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్ధులకు రూ.500గా నిర్ణయించారు.
వెయ్యి రూపాయల అదనపు రుసుముతో మే 10, రెండు వేల అదనపు రుసుముతో మే 21, ఐదు వేల అదనపు రుసుముతో జూన్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రొఫెసర్ తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.