ఆర్‌సెట్ నోటిఫికేషన్‌కు సన్నాహం
ఆర్‌సెట్ నోటిఫికేషన్‌కు సన్నాహం
Published Fri, Aug 5 2016 5:51 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రవేశాలను కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ సెనేట్ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మార్గదర్శకంగా ప్రతీ విభాగంలో ఖాళీల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలన్నారు.బిఆర్‌ఎస్ నియమావళిలో స్వల్పమార్పులు చేస్తున్నామని, వీటిని పూర్తిచేసి మరో రెండు నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి జూన్ మాసంలో ఆర్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఆగష్టు నాటికిప్రవేశాలు జరిపే విధంగా షెడ్యూల్ తయారు చేస్తామన్నారు. ప్రవేశాలు క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
పలువురు విద్యార్థులు దూరవిద్య ప్రవేశాలు, పరీక్ష ఫలితాల విడుదలలో జాప్యం, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ, ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు సంబంధించిన సందేహాలను వీసీ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సాయంత్రానికి పరిష్కారం చేయాలని అదేశించారు. డయల్ యువర్ యూనివర్సిటీలో విద్యార్థులు తెలిపే ప్రతీ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమ ఆమహేశ్వరరావు, ప్రవేశాల సంచాలకుల ఉఆచార్య ఓ.అనీల్ కుమార్, దూరవిద్య సంచాలకులు ఆచార్య ఎల్.డి సుధాకర్ బాబు, పీజీ పరీక్షల డీన్ ఆచార్య కె.విశ్వేస్వరరావు, యూజీ డీన్ ఆచార్య సుదర్శనరావు, సిడిసి డీన్ ఆచార్య టి.కోటేశ్వరరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement