
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు. డిసెంబర్ 7న విశాఖలోని తూర్పు నావికాదళ స్వర్ణోత్సవాలకు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అదే రోజు రాష్ట్రపతి ఏయూను సందర్శించనున్నారు. గతంలో ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని ఏయూకు రావాలని ఆహ్వానించారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment