వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్శిటీ క్యాంపస్లో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది.
వరంగల్: వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్శిటీ క్యాంపస్లో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. స్థానిక గణపతి దేవా హాస్టల్లో హిస్టరీ డిపార్ట్మెంట్లోని సీనియర్ విద్యార్థులు... గత రాత్రి జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. దీంతో బాధితులైన జూనియర్లు గురువారం పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మీడియాకు సమాచారం అందింది. దీంతో మీడియా క్యాంపస్కు చేరుకుని యూనివర్శిటీ అధికారులను ర్యాగింగ్పై వివరణ కోరింది. క్యాంపస్లో ర్యాగింగ్ జరిగినట్లు తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. దీంతో పోలీసులను సంప్రదించగా ర్యాగింగ్ ఘటనపై విచారణ చేస్తున్నామని యూనివర్శిటీ ఎస్ఐ దేవేందర్రెడ్డి వెల్లడించారు.