పాలిటెక్నిక్ విద్యార్థిపై బ్లేడ్‌తో దాడి | Attack on Polytechnic student with blade | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్ విద్యార్థిపై బ్లేడ్‌తో దాడి

Published Tue, Sep 22 2015 1:35 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Attack on Polytechnic student with blade

విశాఖ నగరంలోని పీఎంపాలెంలో ఉన్న సాంకేతిక విద్యా పరిషత్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థిపై బ్లేడ్‌తో అగంతకుడు దాడి చేశాడు. ఈ దాడిలో రాజస్థాన్‌కు చెందిన విద్యార్థికి గాయాలు అయ్యాయి. జైపూర్‌కు చెందిన రాజు అనే విద్యార్థి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే, సోమవారం సాయంత్రం ఓ అగంతకుడు బ్లేడ్‌తో వచ్చి రాజు పొట్ట, చేతిపై గాయపరిచి వెళ్లాడు. చికిత్స కోసం అతడ్ని పీఎంపాలెం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థులందరూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, ర్యాగింగ్ జరిగి ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement