హైదరాబాద్‌సిటీ: హుమాయూన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్ విజయనగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై లక్ష్మణ్ అనే కారు డ్రైవర్ పలుమార్లు అత్యాచారం జరిపాడు. విద్యార్థిని స్నానం చేస్తుండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసినట్లు తేలింది. ఈ విషయం తెలిసి పోలీసులు లక్ష్మణ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్ పై గతంలో కూడా ఎస్ఆర్నగర్, సనత్ నగర్ పోలీస్స్టేషన్లలో అత్యాచార కేసులు నమోదు అయ్యాయి.