తెలంగాణ తొలి శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఆనందం కూడా కొందరు కొత్త ఎమ్మెల్యేలకు మిగలడం లేదు. సభలో తమకు రాక రాక అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే తమ వెనకాలే ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు గేలి చేస్తున్నారని, కామెంట్లతో బెదరగొడుతున్నారని వారు వాపోతున్నారు.
‘కాలేజీల్లోనే నయంలా ఉంది. అసెంబ్లీ హాలులో సీనియర్ ఎమ్మెల్యేల ర్యాగింగ్‌తో గొంతు పెగలడం లేదు. ఇంకేం మాట్లాడుతాం..’ అని ఓ కొత్త ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే తనయుడైన ఈ తాజా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను కూర్చుంటున్న సీటు వెనకాలే గతంలో మా నాన్న కూర్చునేవాడు. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనకనుంచి హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.
కొత్త ఎమ్మెల్యేలకు.. ర్యాగింగ్ బెడద
Published Fri, Nov 21 2014 8:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement
Advertisement