60 వేల మంది డీయూ విద్యార్థుల ప్రతిన
న్యూఢిల్లీ: ప్రాంగణంలో మాదకద్రవ్యాలు, ర్యాగింగ్ జోలికెళ్లబోమంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 60 వేల మంది విద్యార్థులు ప్రతినబూనారు. నగర పోలీసుల సహకారంతో ఓ స్వచ్ఛంద సంస్థ డీయూలో విద్యార్థులకోసం ప్రత్యేకంగా రెండురోజుల శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. ‘లీడర్స్ ఫర్ టుమారో (ఎల్‌ఎఫ్‌టీ)’ అనే స్వచ్ఛంద సంస్థ ....‘ది యాంటీ డ్ర గ్స్, యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ (అడార్)’ పేరిట ఈ శిబిరం నిర్వహించింది. ఈ శిబిరంలో పాల్గొన్నవారిలో ఎనిమిది వేలమంది విద్యార్థులు ఎల్‌ఈటీలో సభ్యత్వం తీసుకున్నారు.
ఈ విషయమై ఎల్‌ఈటీ దక్షిణ విభాగం అధిపతి సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ యువనాయకత్వాన్ని ప్రోత్సహించడమే తమ సంస్థ ముఖ్యోద్దేశమని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై కొత్తగా ఆయా కళాశాలల్లో చేరేవారితోపాటు ప్రస్తుత విద్యార్థులకు అవగాహన పెంపొందించడంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవిధంగా తాము ప్రోత్సహిస్తామన్నారు.
ఇదే విషయమై ఎల్‌ఈటీ దక్షిణ ప్రాంగణం క్యాంపస్ మేనేజర్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్‌లకు దూరంగా ఉంటామంటూ 60 వేల మంది విద్యార్థులు ఈ శిబిరంలో ప్రతినబూనారన్నారు. మూడు విడతలుగా నగరంలోని మరో 150 కళాశాలల్లో ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తామన్నారు. తొలి విడతలో డీయూలో ఈ శిబిరాన్ని నిర్వహించామని, మరో రెండు శిబిరాలను కూడా నిర్వహిస్తామన్నారు. అవి ఇంద్రప్రస్థ, జామియామిలియా విశ్వవిద్యాలయాల్లో జరుగుతాయన్నారు.
మాదకద్రవ్యాల జోలికెళ్లం
Published Fri, Aug 1 2014 10:55 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM
Advertisement