ర్యాగింగ్ చేస్తే క్రిమినల్ చర్యలు | Criminal actions to be taken on raging | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్ చేస్తే క్రిమినల్ చర్యలు

Published Tue, Sep 8 2015 1:58 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

ర్యాగింగ్ చేస్తే క్రిమినల్ చర్యలు - Sakshi

ర్యాగింగ్ చేస్తే క్రిమినల్ చర్యలు

వర్సిటీల రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి భేటీలో నిర్ణయం
ప్రతి కాలేజీలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు
పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు
హాస్టళ్లలో సీసీ కెమెరాలు.. వర్సిటీల్లో ప్రతివారం అవగాహన సమావేశాలు
ర్యాగింగ్ చేస్తే వెంటనే కాలేజీ నుంచి సస్పెన్షన్

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ర్యాగింగ్ నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం జరిగింది. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ర్యాగింగ్ నిరోధానికి చేపడుతున్న చర్యలు, చేపట్టాల్సిన కార్యాచరణపై ఇందులో చర్చిం చారు. ర్యాగింగ్ ఎక్కువగా క్యాంటీన్లు, హాస్టళ్లలో, జనావాసాలకు దూరంగా కాలేజీలు, హాస్టళ్లు ఉన్న చోట బస్సుల్లో వె ళ్లివచ్చేప్పుడు జరుగుతోందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హాస్టళ్లపై దృష్టిసారించాలని నిర్ణయించారు.
 
ప్రతి కాలేజీలో ర్యాగింగ్ నిరోధానికి తల్లిదండ్రులు, సీనియర్ విద్యార్థులు, కాలేజీ యాజమాన్య ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, పోలీసులతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా... తమను ఎవరైనా ఇబ్బంది పెడితే కాలేజీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు వెంకటాచలం, మల్లేష్, కార్యదర్శి శ్రీనివాసరావు, యూనివర్సిటీల రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
 
నిరోధానికి కఠిన చర్యలు..
- ప్రస్తుతం వ్యవసాయ వర్సిటీలో అమలుచేస్తున్న విధంగా ఇద్దరు టీచర్లు ప్రతి రోజూ రాత్రి హాస్టళ్లలో నిద్రించేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం షెడ్యూల్ రూపొందించుకుని అమలు చేయాలి. కేర్  టేకర్లు, సెక్యూరిటీ సిబ్బంది కూడా వారితో ఉంటూ ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టాలి.
 - ర్యాగింగ్ నిరోధానికి కాలేజీల యజమాన్యాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. పోలీసుల సహాయం కోరుతూ లేఖలు రాయాలి. రాత్రివేళలో హాస్టళ్లు ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేలా, పోలీసులు మఫ్టీలో ఉండి ర్యాగింగ్‌కు పాల్పడే వారిని గుర్తించే చర్యలు చేపట్టాలి.
- హాస్టళ్లలో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు చేపట్టాలి.
- అన్ని వర్సిటీల్లో ప్రతివారం ర్యాగింగ్ నిరోధంపై సమావేశాలు నిర్వహించాలి.
- ఆ సమావేశాల్లో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు పాల్గొని సమీక్షించాలి.
- ప్రతి కాలేజీలో ర్యాగింగ్‌కు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేయాలి. రోజుకు రెండుసార్లు వాటిని తెరిచి ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలి.
- విపరీత ప్రవర్తన కలిగిన వారిని ముందే గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి. కాలేజీలు ప్రత్యేకంగా కౌన్సెలర్‌ను నియమించి ర్యాగింగ్ నిరోధంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement