చేర్యాల గురుకులంలో ర్యాగింగ్
విద్యార్థి కిరణ్‌కు గాయాలు
గొడవను ఆపబోయిన వైస్ ప్రిన్సిపాల్‌ను పక్కకు నెట్టేసిన సీనియర్లు
చేర్యాల : పట్టణంలోని సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలలో సీనియర్ విద్యార్థులు జూ నియర్లను ర్యాగింగ్ చేసిన ఘటనలో ఓ విద్యార్థికి తీవ్ర గాయూలయ్యూరుు. స్థానికుల కథనం ప్రకారం..జూనియర్ విద్యార్థి టి.కిరణ్ పాఠశా ల ఆవరణలో నడుచుకుంటూ వెళ్తుండగా సీని యర్ విద్యార్థులు పృథ్వి, అనిల్, శ్రీధర్, శ్యాం లు పిలిచి ర్యాగింగ్ చేశారు. వీపుపై కొట్టడంతో కిరణ్‌కు గాయూలయ్యూరుు. వీరి గొడవను ఆపడానికి యత్నించిన వైస్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్‌ను విద్యార్థులు పక్కకు నెట్టివేశారు. కిరణ్‌ను కొట్టొదంటూ అడ్డుకోబోరుున మరో ఇద్దరు విద్యార్థులను సైతం గాయపరిచారు. గాయూలపాలైన కిరణ్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేరుుంచారు.
అతడిని ఎమ్మార్పీఎస్ నాయకులు మాదాసు యాదగిరి, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల హ క్కుల పరిరక్షణ సమితి నాయకులు బుట్టి భిక్షపతి, కాటం శ్రీనివాస్‌లు పరామర్శించారు. విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్న సీనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.