senior students
-
మళ్లీ ర్యాగింగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ పంజా విసురుతోంది. సుప్రీంకోర్టు తీర్పు (2009), 1956 యూజీసీ చట్టం సెక్షన్ 36, సబ్‌సెక్షన్ (1) ప్రకారం విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం. అయినా ఆకతాయిలైన సీనియర్ విద్యార్థులు అక్కడక్కడా శ్రుతి మించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది రాష్ట్రంలోని గాందీ, కాకతీయ, మహబూబాబాద్ వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ చోటు చేసుకుంది. తాజాగా పాలమూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు గాంధీ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ జరుగుతోందని, అయితే బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.అలాగే మరికొన్ని ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ ర్యాగింగ్ ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. కొత్తగా ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, ర్యాగింగ్ ఘటనలు ఆగడం లేదనే చర్చ జరుగుతోంది. ర్యాగింగ్ పేరిట వికృత చేష్టలు రాష్ట్రవ్యాప్తంగా గత నెల నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. కొత్త విద్యార్థులను రెండు, మూడో ఏడాది చదివే కొందరు ఎంబీబీఎస్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తొలగించాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సస్పెన్షన్లకే పరిమితం అవుతున్నామని వైద్య విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సందర్భంగా కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ గదులకు రప్పించి వారితో బలవంతంగా మద్యం, సిగరెట్లు తాగించినట్లు తేలింది. కొందరితో బట్టలు విప్పించి డ్యాన్స్‌లు చేయించారనే ప్రచారం కూడా జరిగింది. వారు బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కొందరు విద్యార్థినిలను కూడా ర్యాగింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ‘పాలమూరు’లో విద్యార్థులతో గోడకుర్చీ వేయించడం లాంటి దారుణ చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. ఇలా రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ సంఘటనలు జరుగుతున్నా అవి బయటకు పొక్కకుండా యాజమాన్యాలు జాగ్రత్త వహిస్తున్నాయని అంటున్నారు. అయితే కళాశాలలపై నిఘా వేసి ర్యాగింగ్‌ను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఈ విషయంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొన్ని కాలేజీలు డీఎంఈ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంలేదని తెలిసింది. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నా అవి నామమాత్రంగా మారాయని అంటున్నారు. ర్యాగింగ్ ఘటనలపై వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ వాణి వివరణ కోసం ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. క్రిమినల్ చర్య అన్న యూజీసీర్యాగింగ్ను నేరపూరిత (క్రిమినల్) చర్యగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. దీనిపై ఫిర్యాదులకు ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ర్యాగింగ్‌ను నిరోధించాలంటూ ఉన్నత విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లకు, వర్సిటీల వీసీలకు స్పష్టమైన ఆదేశాలున్నాయి. యూజీసీ నిబంధనలు.. » విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీని, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ను, యాంటీ ర్యాగింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. » ర్యాగింగ్ శ్రుతిమించి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన పక్షంలో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, వర్సిటీ రిజిస్ట్రార్లను విచారణకు పిలుస్తారు. వీరు నేషనల్ యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. » విద్యాసంస్థలు, విద్యార్థుల హాస్టళ్లు, కీలక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేయాలి. » విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించాలి. » యాంటీ ర్యాగింగ్ మానిటరింగ్ కమిటీ ఆదేశాల ప్రకారం జూనియర్లు, సీనియర్ల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు మెంటార్íÙప్ను ప్రోత్సహించాలి. » లీగల్ కౌన్సెలింగ్ ద్వారా ర్యాగింగ్ నిరోధక చట్టాలు, శిక్షలపై అవగాహన కల్పించాలి. -
ఐబీఎస్ విద్యార్థుల మధ్య గొడవ.. కేటీఆర్‌కు వీడియో పోస్టు
సాక్షి, హైదరాబాద్: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు, సైబరాబాద్ కమిషనర్‌కు షేర్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు. అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత గొడవ వైరల్ చేస్తున్నారు: సీఐ ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. చదవండి: మోదీ పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..! -
నోట్స్ రాయలేదని
మేడ్చల్: నోట్స్ రాయలేదనే కారణంగా జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మండలం గౌడవెళ్లి గ్రామ పరిధిలోని హితం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరానికి చెందిన ఓ విద్యార్థి హితం ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ మొదటి సంవత్సరం చదవుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం కొంతమంది సీనియర్ విద్యార్థులు తమ నోట్స్ రాసిపెట్టాలని జూనియర్‌కు హుకుం జారీ చేశారు. పరీక్షలు దగ్గరపడుతున్నందున తాను చదుకోవాలని, ఎవరి నోట్స్‌ను తాను రాయనని జూనియర్ సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన సీనియర్ విద్యార్థులు జూనియర్‌ను కళాశాల క్యాంటీన్‌కు రప్పించి వెకిలి చేష్టలతో ర్యాగింగ్ చేశారు. జూనియర్ ఎదురుతిరగడంతో అతనిపై దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఇద్దరినీ పిలిచి మందలించి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. గురువారం కొంతమంది మీడియాకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. ర్యాగింగ్ కాదు.. చిన్న గొడవ తమ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ ఘటనా జరగలేదని, ర్యాగింగ్ నిరోధానికి తాము గట్టి చర్యలు తీసుకున్నామని హితం కళాశాల ప్రతినిధి మిజాబ్ తెలిపారు. బుధవారం కళాశాల క్యాంటీన్లో జూనియర్ విద్యార్థికీ, సీనియర్ విద్యార్థులకూ మధ్య చిన్న గొడవ జరిగిందని, ఇద్దరితో మాట్లాడి విషయాన్ని సెటిల్ చేశామని తెలిపారు. కాగా, హితం కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
చేర్యాల గురుకులంలో ర్యాగింగ్
విద్యార్థి కిరణ్‌కు గాయాలు గొడవను ఆపబోయిన వైస్ ప్రిన్సిపాల్‌ను పక్కకు నెట్టేసిన సీనియర్లు చేర్యాల : పట్టణంలోని సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలలో సీనియర్ విద్యార్థులు జూ నియర్లను ర్యాగింగ్ చేసిన ఘటనలో ఓ విద్యార్థికి తీవ్ర గాయూలయ్యూరుు. స్థానికుల కథనం ప్రకారం..జూనియర్ విద్యార్థి టి.కిరణ్ పాఠశా ల ఆవరణలో నడుచుకుంటూ వెళ్తుండగా సీని యర్ విద్యార్థులు పృథ్వి, అనిల్, శ్రీధర్, శ్యాం లు పిలిచి ర్యాగింగ్ చేశారు. వీపుపై కొట్టడంతో కిరణ్‌కు గాయూలయ్యూరుు. వీరి గొడవను ఆపడానికి యత్నించిన వైస్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్‌ను విద్యార్థులు పక్కకు నెట్టివేశారు. కిరణ్‌ను కొట్టొదంటూ అడ్డుకోబోరుున మరో ఇద్దరు విద్యార్థులను సైతం గాయపరిచారు. గాయూలపాలైన కిరణ్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేరుుంచారు. అతడిని ఎమ్మార్పీఎస్ నాయకులు మాదాసు యాదగిరి, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల హ క్కుల పరిరక్షణ సమితి నాయకులు బుట్టి భిక్షపతి, కాటం శ్రీనివాస్‌లు పరామర్శించారు. విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్న సీనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కళాశాలలో స్నేహగీతం..
-
జూనియర్ ను కొట్టి చంపిన సీనియర్ విద్యార్థులు
హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు కొట్టి చంపిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అమ్మాయి విషయంలో తలెత్తిన వివాదమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, కొట్టిన దెబ్బల తోనే మృతి చెందాడని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొనడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. వివరాలు ఇలా ... సఫిల్‌గూడకు చెందిన ఎన్.మల్లేశ్‌గౌడ్, నిర్మల దంపతుల కుమారుడు యశ్వంత్‌గౌడ్(19) దూలపల్లిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతున్నాడు. నవంబర్ 9 తెల్లవారుజామున ఇంటికి సమీపంలోని స్నేహితుడు వాకింగ్‌కు రమ్మని యశ్వంత్‌కు ఫోన్ చేయగా (ఏపీ28 3837) హీరోహోండా బైక్‌పై వెళ్లాడు. ఉదయం 7.20 నిమిషాలకు సఫిల్‌గూడలో ఉంటున్న మరో విద్యార్థి.. అపస్మారకస్థితిలో ఉన్న యశ్వంత్‌ను వాహనంపై అతడి ఇంటికి తీసుకొచ్చాడు. సఫిల్‌గూడ చెరువుపై లారీ, బైక్‌ను ఢీ కొట్టడంతో గాయపడ్డాడని అతడి తండ్రి మల్లేశ్‌గౌడ్‌కు చెప్పి వాహనాన్ని అప్పగించి వెళ్లిపోయాడు. యశ్వంత్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో చిన్న ప్రమాదమే అనుకున్నారు. కొద్దిసేపటికి కడుపులో నొప్పిగా ఉందని అనడంతో ఏడీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో మహాలక్ష్మి నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు. ఛాతి, కడుపు, ఎక్స్‌రే తీయించారు. కడుపులో బలమైన గాయాలయ్యాయని పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చెప్పడంతో యశోదకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు. రోడ్డు ప్రమాదంగా కేసు.. తోటి విద్యార్థులు చెప్పిన వివరాల మేరకు నేరేడ్మెట్ పోలీసులు రోడ్డు ప్రమాదం కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు అందుకు విరుద్ధంగా వచ్చింది. కడుపు, ఛాతి, మూత్రపిండాలు, తల వెనుక భాగం చిన్న మెదడులో రక్తప్రసరణ ఎక్కడికక్కడే నిలిచిపోయిందని వైద్యులు నివేదిక ఇచ్చారు. తొలుత సఫిల్‌గూడ చెరువుపై ప్రమాదం జరిగిందని తెలిపిన విద్యార్థులు తర్వాత ప్యారడైజ్ ఫ్లైఓవర్‌పై ఘటన జరిగిందని పేర్కొనడంతో కేసును మహంకాళి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. మా బిడ్డను చంపారు.. యశ్వంత్‌ను పథకం ప్రకారం కొంతమంది విద్యార్థులు కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. మత్తు మందు ఇచ్చి బయటికి కనిపించని విధంగా బలమైన దెబ్బలు కొట్టారని, అదే పోస్టుమార్టం నివేదికలో ఉందన్నారు. టీ షర్టుపై కూడా బూటు కాలు ముద్రలున్నాయని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య కేసుగా నమోదు చేసి, నిందితులను శిక్షించాలని మృతుడి తల్లిదండ్రులు నగర సీపీ ఎం.మహేందర్‌రెడ్డిని కోరారు. ప్రేమ వ్యవహారమే కారణమా? ఓ విద్యార్థిని విషయంలో యశ్వంత్‌కు కళాశాలలో చదువుతున్న సీనియర్లతో వివాదం ఉన్నట్టు తెలుస్తోంది. సంఘటనకు ముందురోజు సదరు విద్యార్థినికి వాట్సప్ మెసేజ్ పంపాడు. ఈ విషయమై నవంబరు 8న కళాశాల నుంచి ఇంటికి వచ్చే సమయంలో కృపా కాంప్లెక్స్ వద్ద సీనియర్ విద్యార్థులతో గొడవ జరిగినట్టు తెలి సింది. దాడిలో 10 మంది వరకు పాల్గొన్నారని, వారిని విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని మృతుని తండ్రి మల్లేశ్ పోలీసులను కోరారు. -
ఫ్రెషర్స్ డే వేడుకల్లో రగడ!