ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై ఆదివారం అధికారులు విచారణ ......
యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై ఆదివారం అధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్వీయూలో ర్యాగింగ్ అంశంపై ఆదివారం సాక్షి దినపత్రికలో సోమవారం నుంచి సినిమా చూపిస్తాం అన్న శీర్షికతో కథనం వెలువడింది. దీనికి అధికారులు స్పందించారు.
మధ్యాహ్న సమయంలో రెక్టార్ జయశంకర్, ప్రిన్సిపాల్ భగవాన్ రెడ్డి, డెప్యూటీ వార్డన్ రమేష్‌బాబు డి.బ్లాక్‌ను సందర్శించారు. ఘటనపై విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.