డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. డిచ్‌పల్లి మండలం బర్థిపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ కాలేజీలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం విద్యార్థులు తమను ర్యాగింగ్ చేస్తున్నారని సెకండియర్ విద్యా ర్థి నులు ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు జూనియర్లు తమ తల్లి దండ్రులకు తెలియజేయడంతో వారు కాలేజీ వద్దకు వచ్చి మేనేజ్‌మెంట్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము ప్రెషర్స్ పార్టీ చేసుకుంటుండగా సీనియర్ విద్యార్థులు ఫ్లెక్సీ చించివేశారని, అడ్డుకున్న తమను కొట్టారని జూనియర్లు ఆరోపించారు. నలుగురు బయట వ్యక్తుల్ని కాలేజీకి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. విషయం తెలుసుకున్న డిచ్‌పల్లి ఎస్సై గణేశ్ కాలేజీకి చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పారు. జూనియర్లు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తృతీయ సంవత్సరానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, సెకండియర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు.
సీనియర్లను పోలీసులు తీసుకెళ్తుండగా కొందరు జూనియర్లు వారిపైకి చెప్పులు విసిరారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థు లపై చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇ వ్వడంతో జూనియర్లు శాంతించారు. అయితే జూనియర్లను తాము వేధించలేదని సీనియర్లు చెప్పడం కొసమెరుపు. దీనిపై కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు ‘సాక్షి’ప్రయత్నించగా వారు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment