ర్యాగింగ్‌ వద్దు.. | No Raging | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ వద్దు..

Published Wed, Aug 24 2016 7:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

ర్యాగింగ్‌ వద్దు..

ర్యాగింగ్‌ వద్దు..

వైవీయూ :

విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్‌ అనే ఆధిపత్య సంస్కృతిని బహిష్కరించి, ప్రజాస్వామ్య సంస్కతిని పెంపొందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం యోగివేమన విశ్వవిద్యాలయంలో ఆర్‌ఎస్‌ఎఫ్, పరిశోధక విద్యార్థి సంఘం, వైవీయూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సెమినార్‌హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యవక్తగా హాజరైన విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ ర్యాగింగ్‌ను నిరోధించడంలో విశ్వవిద్యాలయ విఆ్యర్థులు ప్రగతిశీలభావాలు కలిగి ఉండి సమాజ అభివద్ధిలో క్రియాశీలకపాత్ర పోషించాలని సూచించారు. సమాజంలో ఉండే ఆధిపత్యాన్ని యూనివర్సిటీల్లో కూడా అసంబద్ధంగా అమలు అవుతోందని, విద్యాబోధన కూడా ఇందుకు అనుగుణంగా ఉందని విమర్శించారు.

రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్‌ఎస్‌ఎఫ్‌) కన్వీనర్‌ మల్లెల భాస్కర్, కో కన్వీనర్‌ దస్తగిరి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు హక్కుల కోసం ఉద్యమించే సంస్కతి పెంపొందించుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్థి హక్కుల నుంచి సమాజంలోని ప్రజల హక్కుల వరకు విద్యార్థులే ఉద్యమించాలన్నారు. విద్యార్థులు సామాజిక బాధ్యతతో ఉద్యమించాలని కరారు. ప్రగతి విరోధక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. ర్యాగింగ్‌ సంస్కతిని విడనాడి నిరుద్యోగ సమస్య వంటి సామాజిక సమస్యలపై పోరాడేందుకు అందరూ కలిసిరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు భరత్, రమేష్, విద్యార్థి నాయకలు గోపాల్, ప్రవీణ్, శ్యామిల్, శ్యాంసుందర్‌రెడ్డి, గురుప్రసాద్, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement