
కర్నూలు: జిల్లాలో పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి కర్నూలు చేరుకున్న చంద్రబాబు నాయుడుని వీజేఆర్ ఫంక్షన్ హాలు వద్ద రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు, జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఇటీవల రాష్ట్ర రాజధాని అమరావతిలో పర్యటన ముగించకున్న చంద్రబాబు.. సోమవారం కర్నూలుకు చేరుకున్న విషయం తెలిసిందే. పర్యటన గురించి తెలుసుకున్నవివిధ సంఘాల నేతలు వీజేఆర్ ఫంక్షన్ హాలు వద్దకు చేరుకొని.. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హైకోర్టు లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తేనే ఆయనను కర్నూలు జిల్లాలో అడుగు పెట్టనిస్తామని విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
చదవండి: రాజధానిలో రక్తికట్టని వీధి నాటకం
Comments
Please login to add a commentAdd a comment