జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఒకేషనల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన కాలేజీల బంద్ విజయవంతమైంది.
జూనియర్ కాలేజీల బంద్ విజయవంతం
Published Wed, Jan 4 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
– కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్
– బంద్‌లో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ సంఘాలు
కర్నూలు (సిటీ): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఒకేషనల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన కాలేజీల బంద్ విజయవంతమైంది. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల నాయకులు వేర్వేరుగా బృందాలుగా ఏర్పడి నగరంలోని ప్రభుత్వ కాలేజీలను బంద్ చేయించారు. ఈ సందర్బంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయకపోవడంతో పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందనా్నరు. తమకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మె చేస్తే వారిని పట్టించుకోవడం లేదనా్నరు. ఈనెల చివరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయని, అధ్యాపకులు సమ్మెలో ఉంటే వారి పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మతో ప్రభుత్వ జూనియర్ (టౌన్ మోడల్) కాలేజీ నుంచి రాజ్‌విహార్ వరకు శవయాత్ర నిర్వహించారు. పోలీసులు శవయాత్రను అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా కాలేజీల బంద్ చేయించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కార్యక్రమాల్లో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి భాస్కర్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఇతర నాయకులు అక్బర్, శివ, రమణ, వినోద్, మోహన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement