10వ రోజుకు చేరిన కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన
Published Mon, Dec 12 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లు చేపట్టిన ఆందోళన పదో రోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. కాగా, ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళనను కొనసాగిస్తామని కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ నాయకులు రంగస్వామి, నవీన్‌కుమార్, రామకృష్ణ, నాగరాజు పేర్కొన్నారు.
పలువురు మద్దతు..
పదో రోజు దీక్షలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆదివారం పలువురు మద్దతు ప్రకటించారు. త్వరలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్న కేవీసుబ్బారెడ్డి, ఎస్‌కే యూనివర్సిటీ చరిత్ర ఉపన్యాసకులు మల్లికార్జుననరెడ్డి, ప్రత్యేక రాయలసీమ ఐక్య పోరాట సమితి మద్దతు ప్రకటించింది.
Advertisement
Advertisement