విద్యార్థిని వాతలు తేలేలా కొట్టిన టీచర్
- యాజమాన్యాన్ని నిలదీసిన విద్యార్థి తండ్రి
ప్రత్తిపాడు: మాట వినలేదనో, పాఠం చెప్పలేదనో పసిపిల్లాడిని ఇంత కర్కశంగా వాతలు తేలేలా కొడతారా? మీకు చేతులెలావచ్చాయి.. అంటూ ఓ విద్యార్థి తండ్రి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ప్రత్తిపాడుకు చెందిన శ్రీనివాసరెడ్డి తన కుమారుడిని ప్రత్తిపాడులోని సరోజిని విద్యాలయంలో రెండవ తరగతి చదివిస్తున్నాడు. బుధవారం పాఠం సక్రమంగా చెప్పలేదని క్లాస్ టీచర్ స్కేల్‌తో రెండుకాళ్లపై కొట్టడంతో విద్యార్థికి ఎర్రగా వాతలు తేలాయి. పాఠశాల ముగిసిన తరువాత విద్యార్థి ఇంటకివెళ్లి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు అడిగారు. పిల్లవాడు వాతలు చూపంచి టీచర్ కొట్టిందని చెప్పడంతో తలిదండ్రులు వచ్చి ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యానికి వాతలు చూపించారు. స్పందించిన యాజమాన్యం పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని చెప్పడంతో శ్రీనివాసరెడ్డి శాంతించారు.