Class Teacher
-
సార్.. వస్తున్నారని ఆతృత.. జారిపడిన విద్యార్థి
సాక్షి, మూసాపేట: మూసాపేట బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి (ఇంగ్లిష్ మీడియం) చదువుతున్న విశ్వనాథ్ ఎడమ చేయి బుధవారం పాఠశాలలో విరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తరగతి గది బయట విద్యార్థులు మాట్లాడుతుండగా ఓ విద్యార్థి సార్ వస్తున్నాడు అని చెప్పడంతో తోటి విద్యార్థులు అందరూ ఒక్కసారిగా తరగతి గదిలోకి వెళ్ళారు. ఈ క్రమంలో విశ్వనాథ్ అనే విద్యార్థి బెంచి తగిలి కింద పడటంతో అతనిపై మిగతా విద్యార్థులు పడగా విశ్వనాథ్ చేయి విరిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. టీచర్ తరగతి గదికి వచ్చే గ్యాప్‌లో ఈ సంఘటన జరిగిందని హెచ్ఎం రాజ్ పాల్ సింగ్ తెలిపారు. సకాలంలో తరగతికి ఉపాధ్యాయులు హాజరు కాలేకపోవడం వల్లే ప్రమాదం జరిగింది అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
క్వారంటీనా జోషీ.. కోవిడ్ అవస్థీ
గుడ్ మార్నింగ్ క్లాస్! నౌ ఐయామ్ గోయింగ్ టు టేక్ యువర్ అటెండెన్స్ క్వారంటీనా జోషీ.. ప్రెజెంట్ మిస్ లాక్డౌన్ సింగ్ రాథోడ్... జెంట్ మిస్ కోవిడ్ అవస్థీ.. కోవిడ్..? బీ అటెన్షన్ ఇన్ ద క్లాస్.. అదర్ వైజ్ ఐ విల్ సెండ్ యు బ్యాక్ టు చైనా కరోనా పాల్ సింగ్.. ప్రెజెంట్ మిస్ సోషల్ డిస్టెన్స్ సింగ్.. ప్రెజెంట్ మిస్ ఉహాన్ భదురియా... ఉహాన్..? యూ అండ్ కోవిడ్ వెరీ నాటీ, గెటవుట్ ఆఫ్ మై క్లాస్ రైట్ నౌ! దాదాపు ఏడాది క్రితం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ‘క్లాస్ ఆఫ్ 2025’ వీడియో ఇది. ఎంతో క్రియేటివ్‌గా ఆలోచించి, వీడియోలో టీచర్ పాత్రను పోషిస్తూ లక్షలమందిని ఆకట్టుకున్నారు స్నేహిల్ దీక్షిత్ మెహ్రా. ఈ వీడియోతో బాగా పాపులర్ అయిన స్నేహిల్ హిందీ టీవీ చానల్లో క్రియేటివ్ హెడ్‌గా పనిచేస్తూనే, సమయం దొరికినప్పుడల్లా మంచి సందేశంతో కూడిన కామెడీ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో పెరిగిన స్నేహిల్... ఇంజినీరింగ్ చదివింది. ఫైనల్ ఇయర్లో ఉండగానే.. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచి్చంది. కానీ ఆర్థిక మాంద్యంతో కొన్నినెలల్లోనే ఉద్యోగం పోయింది. చిన్నప్పటి నుంచి యాంకర్ కావాలని కలలు కనే స్నేహిల్.. న్యూస్ చానల్లో ఇంటర్న్‌గా చేరింది. కొన్నాళ్లు పనిచేసాక, ఇంటర్న్‌షిప్ మానేసి, సినిమా రిపోర్టర్‌గా చేస్తూనే టెలివిజన్ ప్రొడక్షన్ హౌస్‌లో ట్రైనీగా చేరింది. పని నేర్చుకుంటూనే, ప్రముఖ షోలలో చురుకుగా పనిచేసేది. దీంతో కొద్దికాలంలోనే స్నేహిల్ క్రియేటివ్ హెడ్‌గా మారింది. తరువాత వివిధ రకాల టీవీ చానల్స్‌లో ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా చేసింది. ప్రముఖ ‘దిల్ సే దిల్ తక్’ వంటి అనేక పాపులర్ షోలకు క్రియేటివ్ హెడ్‌గా చేసింది. భేరి క్యూట్ ఆంటీ క్రియేటివ్ హెడ్‌గా దూసుకుపోతున్న స్నేహిల్‌కు..‘అపహరణ’ వెబ్‌సిరీస్ స్క్రిప్ట్ వచ్చింది. ఈ స్క్రిప్ట్‌ను ఏక్తాకపూర్కు వినిపించింది. ఏక్తాకు నచ్చడంతో ‘అపహరణ్’కు స్నేహిల్ క్రియేటివ్ హెడ్‌గా పనిచేసింది. అంతేగాక ఈ సిరీస్‌లో ‘పండిట్గారి భార్య’ అనే చిన్న క్యారెక్టర్‌ను చేసింది. ఈ వెబ్ సిరీస్ హిట్ అవడంతో.. స్నేహిల్‌కు కామెడీ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే బావుంటుందన్న ఆలోచన వచి్చంది. వెంటనే బీసీ ఆంటీ(భేరీ క్యూట్ ఆంటీ) పేరుమీద యూట్యూబ్ చానల్‌ను క్రియేట్ చేసి, ఇంకా ఇన్‌స్ట్రాగామ్‌లో చిన్నచిన్న కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టింది. సినిమాలు, వెబ్‌సిరీస్, టీవీ షోలలో వచ్చే ఆంటీ క్యారెక్టర్లపై రివ్యూల రూపంలో వీడియోలు చేసి అప్లోడ్ చేసేది. స్నేహిల్ కామెడీ, సమయస్ఫూర్తి, వీడియోలో ఇచ్చే మెసేజ్ నచ్చడంతో..అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగి, బీసీ ఆంటీగా బాగా పాపులర్ అయ్యింది. క్లాస్ ఆఫ్ 2025... లాక్డౌన్ సమయంలో ‘క్లాస్ ఆఫ్ 2025’ కామెడీ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో స్నేహిల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దీనిలో ముఖ్యంగా కోవిడ్ పేరు మీద పిల్లలకు పేర్లు పెట్టడం అందర్ని బాగా ఆకట్టుకుంది. దీని తరువాత అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చిన ఆంటీ తనని తాను పొగుడుకునే ‘బిట్టు బువా’ అనవసరమైన వార్తలు చదివే యాంకర్ ‘ప్రభా’ క్యారెక్టర్లతో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు కూడా క్రియేటివ్ హెడ్‌గా, సంజయ్ లీలా బన్సాలీ వంటి వారితో కలిసి పనిచేస్తూనే, మరోపక్క కామెడీ వీడియోల ద్వారా లక్షలమంది వ్యూవర్స్‌ను ఆకట్టుకుంటోంది స్నేహిల్. View this post on Instagram A post shared by Snehil Mehra (@bcaunty) -
మొదటి నమస్కారం... టు టీచర్.. విత్ లవ్
లెక్కల టీచరు లీవ్ పెట్టాడని తెలిస్తే పండగ. తెలుగు క్లాసు సాయంత్రం లాస్ట్ పిరియడ్ ఉన్నా పండగే. సైన్స్ సారు రోజూ కానుగ బెత్తాలు తెప్పిస్తాడు... కొడతాడా... పాడా... గ్రామర్ చెప్పే ఇంగ్లిష్ మాస్టారు జాలిగా చూడటం తప్ప ఏం చేయగలడు. ఇంట్లో ఒక అమ్మ ఉంటే సోషల్ టీచరు ఇంకో అమ్మ. ఆ రోజులు వేరు. ఆ జ్ఞాపకాలు వేరు. ప్రతి విద్యార్థికి ఏది గుర్తున్నా లేకున్నా జీవితాంతం తమ గురువులు గుర్తుంటారు... ఆ అల్లర్లూ గుర్తుంటాయి. ఇవాళ అవన్నీ గుర్తు చేసుకుని టైమ్ ట్రావెల్ చేయాల్సిందే. కొందరు టీచర్లు పాఠాలు చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలు తప్ప అన్నీ చెప్తారు. కొందరు టీచర్లు పాఠాలతో పాటు చాలా విషయాలూ చెప్తారు. కొందరు టీచర్లు పిల్లలతో చనువుగా ఉంటారు. కొందరు పిల్లలతో గంభీరంగా ఉంటారు. కొందరు పాఠం చెప్పేంత వరకూ గంభీరంగా ఉండి పాఠం అయిన వెంటనే క్లాస్రూమ్ వయసుకు దిగిపోతారు. కొందరు టీచర్లు పెద్ద గొంతుతో చెప్తారు. కొందరు రహస్యం చెప్పినట్టు చెబుతారు. కొందరు నోరే తెరవరు బోర్డు మీద రాయడం తప్ప. కొందరు ఒక ప్రవాహంలా పాఠాన్ని కొనసాగిస్తారు. ఎవరు ఎలా ఉన్నా వారంతా పిల్లల కోసం జీవితాలను వెచ్చించిన సార్లు, టీచర్లు, మేష్టార్లు... మొత్తంగా గురువులు. వారికి విద్యార్థులు మనసులో సదా ప్రణామం చేసుకుంటారు. కాని వారి ఎదుటే అల్లరి కూడా చేస్తారు. టీచర్లూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఎంత అల్లరి అనుమతించాలో వారికి తెలుసు. ఎంత సరదా క్లాసులో పండాలో తెలుసు. బెత్తం ఫిలాసఫీ ‘దండం దశగుణం భవేత్’ అని టీచర్లు అప్పుడప్పుడు బెత్తం ఆడిస్తూ పిల్లలతో అంటారు. అంటే ఒంటి మీద ఒక్క దెబ్బ పడితే వంద వికారాలు దారిలోకి వస్తాయని. కొందరు దానిని ఆచరించి చూపుతారు. అరచేతులు చాపమంటే బెత్తం దూరానికి సాగకుండా పిల్లలు మరీ చేతులు ముందుకు చాచి దెబ్బ తగలని టెక్నిక్ పాటిస్తారు. కొందరు టీచర్లు బెత్తం టేబుల్ మీద ఉంచుతారుగానీ ఎప్పుడూ వాడరు. కొందరు అసలు బెత్తం ఉండాలనే కోరుకోరు. కానుగ బెత్తాలు కొందరు.. వెదురు బెత్తాలు కొందరు... ఇంకొందరు చెక్క డెస్టర్ను దాదాపు మారణాయుధంతో సమానంగా వాడతారు. కొందరు చాక్పీస్ను ఉండేలు కన్నా షార్ప్‌గా విసురుతారు. కొందరు తొడబెల్లం బహుతీపిగా పెడతారు. జీవహింస ఇష్టపడని టీచర్లు క్లాసులో బలమైన స్టూడెంట్‌ని లేపి అతని/ఆమె ద్వారా చెంపలు పగుల గొట్టిస్తారు. కాసేపు అవమానం అవుతుంది. ఆ తర్వాత? ఆ.. మనికిది మామూలే అని ఇంటర్వెల్లో ఐస్ కొనుక్కోవడానికి విద్యార్థులు పరిగెడతారు. మూడీ... కొందరు టీచర్లు మూడ్ బాగుంటే క్లాసు కేన్సిల్ చేసి ఇవాళ కథలు చెప్పుకుందామా అంటారు. ఇక క్లాసు యమా కులాసా. పాటలు వచ్చినవాళ్లు పాడండ్రా అంటే ఊళ్లోని సినిమా హాళ్లన్నీ క్లాసురూమ్‌లోకి వచ్చేస్తాయి. ఒకడు ఘంటసాల, ఒకడు బాలు, ఒకమ్మాయి ఎస్.జానకి. గున్నమామిడీ కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి... ఓహ్. ఒకటే అల్లరి. కొందరు టీచర్లకు మూడ్ పాడైతే ఆ రోజు ఏ తప్పు చేయకపోయినా చిర్రుబుర్రుమంటారు. కొందరు ఎవడో ఒకణ్ణి బోర్డ్ మీద ఏదో రాయమని కునుకు తీస్తారు. కొందరు ఫలానా పాఠం పేరు చెప్పి దానిని చదవమని క్లాస్ చివరలో ప్రశ్నలు అడుగుతానని చెప్పి స్థాయి విశ్రాంతి తీసుకుంటారు. గురువులు. వారి చిత్తం. విద్యార్థుల ప్రాప్తం. ఇష్ట/అయిష్ట టీచర్లు స్కూల్లో ప్రతి స్టూడెంట్‌కు ఇష్ట అయిష్ట టీచర్లు ఉంటారు. క్లవర్లకు లెక్కల సారు ఇష్టం. నాన్ క్లవర్లకు సోషల్ సారు ఇష్టం. ఆటల్లో గెంతే వారికి పి.టి.సారు ఇష్టం. బొమ్మలు వేసుకునేవారికి డ్రాయింగ్ మాష్టారు ఇష్టం. ఇంటికి ఇంగ్లిష్ పేపర్ వచ్చే పిల్లలకు ఇంగ్లిష్ టీచర్ దగ్గర భోగం నడుస్తుంది. వేమన పద్యాలు వచ్చిన స్టూడెంట్ తెలుగు టీచరమ్మకు ముద్దు పిల్లడు. ఇష్టం లేని, కష్టమైన ప్రశ్నలు అడిగే సారు ఆ ప్రశ్నలు అడగాల్సిన రోజున సైకిల్ మీద నుంచి కింద పడి స్కూలుకు రాకూడదని మొక్కులు మొక్కే విద్యార్థులు ఎందరో. ఆ మొక్కులన్నీ ఆ యొక్క మాస్టార్లకు అమోఘ సంజీవనులు. సింహస్వప్నం తండ్రి బజారులో కనిపిస్తే అల్లరిగా తిరిగే కొడుకు ఇంటికి పరిగెత్తుతాడు. స్కూల్ సార్ కనిపించినా అల్లరిగా తిరిగే స్టూడెంట్ పరిగెత్తుతాడు. తండ్రి తర్వాత తండ్రి మేష్టారు. తల్లి తర్వాత తల్లి టీచరమ్మ. ఇంట్లో మంచి అలవాట్లు. బడిలో విద్యాబుద్ధులు. కన్నందుకు తల్లిదండ్రులకు తప్పదు. కాని కనకపోయినా బాగు కోరేవాడే బడిపంతులు. లోకంలో చాలా ఉపాధులుంటాయి. కాని టీచర్లు అయినవారిలో 90 శాతం మంది టీచరు కావాలని అనుకుని అయినవారు. పిల్లలకు మంచి చెప్పాలని అయినవారు. పిల్లలనే పూల మధ్య వసించడమే వారికి ఇష్టం. విద్యార్థులు పెద్దవారై దేశాలు దాటుతారు. కాని టీచర్లు ఆ స్కూల్లో అదే తరగతిలో అదే సిలబస్ మళ్లీ మళ్లీ చెబుతూ అక్కడే ఆగిపోతారు. వారు విద్యార్థుల నిచ్చెనలు. ఇవాళ ఆ నిచ్చెన దిగి విద్యార్థులందరూ తమ టీచర్లను తలుచుకోవాలి. కాంటాక్ట్ నంబర్ ఉంటే ఫోన్ చేసి నమస్కారం చెప్పుకోవాలి. దాపున ఉంటే వెళ్లి ఒక పూలహారం వేసి ఆశీర్వాదం తీసుకోవాలి. గురువంటే జ్ఞానం. మార్గం. ఆ మార్గదర్శికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. -
విద్యార్థిని వాతలు తేలేలా కొట్టిన టీచర్
- యాజమాన్యాన్ని నిలదీసిన విద్యార్థి తండ్రి ప్రత్తిపాడు: మాట వినలేదనో, పాఠం చెప్పలేదనో పసిపిల్లాడిని ఇంత కర్కశంగా వాతలు తేలేలా కొడతారా? మీకు చేతులెలావచ్చాయి.. అంటూ ఓ విద్యార్థి తండ్రి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ప్రత్తిపాడుకు చెందిన శ్రీనివాసరెడ్డి తన కుమారుడిని ప్రత్తిపాడులోని సరోజిని విద్యాలయంలో రెండవ తరగతి చదివిస్తున్నాడు. బుధవారం పాఠం సక్రమంగా చెప్పలేదని క్లాస్ టీచర్ స్కేల్‌తో రెండుకాళ్లపై కొట్టడంతో విద్యార్థికి ఎర్రగా వాతలు తేలాయి. పాఠశాల ముగిసిన తరువాత విద్యార్థి ఇంటకివెళ్లి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు అడిగారు. పిల్లవాడు వాతలు చూపంచి టీచర్ కొట్టిందని చెప్పడంతో తలిదండ్రులు వచ్చి ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యానికి వాతలు చూపించారు. స్పందించిన యాజమాన్యం పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని చెప్పడంతో శ్రీనివాసరెడ్డి శాంతించారు.