
సాక్షి, రాజంపేట :ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులను, యువకులను పొట్టనపె ట్టుకున్న బ్లూవెల్‌గేమ్ భారతదేశంలోకి వ్యాపించింది. ఇప్పుడు రాజంపేట పట్టణంలో కలకలం రేపినట్లు సమాచారం. రాజంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ వల్ల పరస్పరం బ్లేడ్స్‌తో కోసుకున్నారని తెలిసింది. కాగా ఈ వార్తలు.. పుకార్లు షికార్లు చేశాయి. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ ఆడి అందులో వచ్చిన మెసేజ్‌చూసి బ్లేడ్స్‌తో కోసుకున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విద్యార్థుల చేతులను పరిశీలించిన ఉపాధ్యాయులు వారిని మందలించినట్లు తెలిసింది. వెంటనే ఆ ఇద్దరినీ తల్లిదండ్రులతో ఇంటికి పంపించినట్లు మిగతా పిల్లలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంపై పాఠశాల యాజమాన్యాలు ధృవీకరించడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment