
గద్వాల క్రైం: తరగతి గదిలో అల్లరి చేశాడని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి చేయి విరగ్గొట్టాడు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. గద్వా లకు చెందిన సత్యరెడ్డి, పుష్పలత కుమారుడు తేజవర్ధన్‌రెడ్డి స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని విశ్వభారతి హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు.
మధ్యాహ్నం తరగతి గదిలో గణితం ఉపాధ్యాయుడు నరేందర్ విద్యార్థులకు పాఠం చెబుతున్నాడు. ఇంతలో అల్లరి చేశాడనే కోపం తో తేజవర్ధన్‌రెడ్డిపై సదరు ఉపాధ్యాయుడు భుజంపై తన మోచేతితో బలంగా బాదాడు. సాయంత్రం ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. మంగళవారం రాత్రి కొడుకును కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయిస్తు న్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా డీఈఓ వేణు గోపాల్, పోలీసులు విచారణ చేపట్టారు.