నిజాంసాగర్ : విద్యార్థుల భవితకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షల కాలం దగ్గరపడుతోంది. పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ ప డుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. అయినా డిప్యూటేషన్ పద్ధతిన బోధిస్తున్నారు. రెండు నెలలుగా ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీ సుకుంటున్నారు. గ్రేడింగ్ పాయింట్లు ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిదన్న ధోరణితో ప్రైవేట్ విద్యాసంస్థలు ముందుకు వె ళ్తున్నా యి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అత్యధిక గ్రేడింగ్ ను సాధించేందుకు పొటాపోటీగా సాగుతున్నాయి.
విద్యార్థులతో రివ్యూలు..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదికి పది గ్రేడింగ్ పా యింట్ల కోసం ఉపాధ్యాయులు, యాజమాన్యాలు, వి ద్యార్థుల ప్రత్యేక తరగతులపైనే దృష్టి సారించారు. స బ్జెక్టులవారీగా వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి న ఉపాధ్యాయులు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గత నవంబర్ నుంచి పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు సాగుతున్నాయి.డిసెంబర్ నెలాఖరువరకు సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను పూర్తి చేశారు. దీంతో ప్రత్యేక తరగతులపై మరింత పదను పెట్టారు. అటు వెంటనే ఉ పాధ్యాయులు విద్యార్థులతో రివ్యూ చేయిస్తు న్నారు. పాఠశాలల సెలువు దినాల్లో సైతం విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు.
బట్టీ విధానానికి స్వస్తీ...
జిల్లాలో 515ప్రభుత్వ, 280 ప్రైవేట్ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటి ద్వారా 33,519మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. గతేడాది నుంచి పదో తరగతి విద్యార్థులకు బట్టీ విధానం కాకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) పద్ధతిలో పరీక్షలు సాగుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు బోధన తలకు మించిన భారంగా మారింది. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను గుర్తించలేకపోతున్నారు. ఏదేమైనా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తర్ణత కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు కుస్తీ పడుతున్నారు.
ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు...
సిలబస్ విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఫలి తంగా టెన్త్ విద్యార్థులకు పరీక్షల ఫీవర్ పట్టుకుంది.
పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌ను ‘నిఘానేత్రం’ బట్టబయలు చేయనుంది. మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు గురువారం డీఈవో నుంచి పరీక్షా కేంద్రాల హెచ్‌ఎంలకు ఆదేశాలు అందాయి. జిల్లాలోని 194 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
టెన్‌షన్..!
Published Fri, Jan 29 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM
Advertisement
Advertisement