పాఠశాల ఎదుట మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు. (ఇన్‌సెట్లో) తేజస్విని
మొయినాబాద్ (చేవెళ్ల): ప్రైవేటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడి వేధింపులతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరుకు చెందిన కుమ్మరి యాదయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు పూజిత ఇంటర్ చదువుతుండగా చిన్న కూతురు తేజస్విని (15) అదే గ్రామంలో శివసాయి ఇంటర్నేషన ల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. అదే స్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బొల్లు ప్రశాంత్, తేజస్వినిని వేధిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఆమెకు ప్రశాంత్ సెల్‌ఫోన్ ఇచ్చాడు. ఆమె ఫోన్ తిరిగి ఇచ్చేయడంతో మరింత వేధించసాగాడు. మనస్తాపా నికి గురై శనివారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలార్పే క్రమంలో తల్లిదం డ్రులకీ గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో తేజస్విని ఇంట్లోనే మృతి చెందింది.
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాక...
తేజస్విని మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పోలీసులకు విషయం తెలియడంతో సీఐ సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
మృతదేహంతో ఆందోళన...
తేజస్విని ఆత్మహత్యకు కారణమైన టీచర్, పాఠశాల యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని గ్రామస్తులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం మృతదేహాన్ని తీసుకొచ్చి పాఠశాల ఎదుట పెట్టి ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment