![Classmates Attacked On A Student With Geometry Compass - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/27/CRIME.jpg.webp?itok=0wQjjENc)
ఇండోర్: నాల్గవ తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై అతని క్లాస్‌మెట్స్ ముగ్గురు కలిసి పదునైన వృత్తలేఖినితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఒకటి, రెండుసార్లు కాకుండా ఏకంగా 108 సార్లు అతన్ని పొడిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగింది. ఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సుమోటోగా తీసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
‘ఈ ఘటన షాకింగ్‌గా ఉంది. ముగ్గురు స్టూడెంట్స్ కలిసి ఒక విద్యార్థిని 108 సార్లు పొడిచి గాయపరిచారు. దీనిపై ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏయిరోడ్రోమ్ పోలీసులను కోరాం. ఇంత చిన్న వయసులో ఆ ముగ్గురు విద్యార్థులు ఎందుకంత హింసాత్మక ప్రవర్తించారనేది పోలీసులు తేల్చాలి’ అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వ్యాఖ్యానించారు.
నా కొడుకు స్కూల్ నుంచి వచ్చినపుడు అతని ఒంటిపై చాలా గాయాలున్నాయి. గాయాల గురించి అడిగితే జరిగిన ఘటనను అతడు వివరించాడు. అసలు వాళ్లెందుకంత హింసాత్మకంగా దాడి చేశారో అర్థం కావడం లేదు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అడిగితే స్కూల్ మేనేజ్‌మెంట్ ఇవ్వడం లేదు’అని గాయపడిన విద్యార్థి తండ్రి చెప్పారు.
ఇదీచదవండి..ట్రాక్ దాటుతుండగా..ఆ ఏనుగులను
Comments
Please login to add a commentAdd a comment