Compass
-
జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జామెట్రీ కంపాస్‌తో విచక్షణారహితంగా 108 సార్లు దాడి చేసి గాయపరిచారు. నవంబర్ 24వ తేదీన ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల దాడి ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(డబ్ల్యూసీ) తీవ్రంగా స్పందించింది. ఘటనపై వెంటనే తమకు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ‘‘ గొడవ సందర్భంగానే చిన్నారులు ఇలా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. నిందితులైన విద్యార్థులకు హింసాత్మకమైన సన్నివేశాలున్న వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? నాలుగో తరగతి విద్యార్థుల్లో ఇంతటి హింసాప్రవృత్తి ఎలా సాధ్యం? దీనికి కారణాలేంటి? ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తాం. పోలీసుల నివేదిక కోరాం’’ అని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ పల్లవి చెప్పారు. ‘‘ మా అబ్బాయి రక్తమోడుతూ ఇంటికొచ్చాడు. అసలేం జరిగిందో తెలీడం లేదు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ ఇచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. వారు బహుశా తమ తప్పును కప్పిపుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారేమో’’ అని బాధిత విద్యార్థి తండ్రి వాపోయాడు. ‘‘ బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులైన విద్యార్థుల వయసు పదేళ్లలోపే. సంబంధిత చట్టాల ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతోంది’’ అని నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వివేక్ సింగ్ చౌహాన్ చెప్పారు. ‘‘కొంతకాలంగా స్కూలు చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనిపై అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఫోర్త్ క్లాస్ విద్యార్థుల హింస..
ఇండోర్: నాల్గవ తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై అతని క్లాస్‌మెట్స్ ముగ్గురు కలిసి పదునైన వృత్తలేఖినితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఒకటి, రెండుసార్లు కాకుండా ఏకంగా 108 సార్లు అతన్ని పొడిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది. ఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సుమోటోగా తీసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ‘ఈ ఘటన షాకింగ్‌గా ఉంది. ముగ్గురు స్టూడెంట్స్ కలిసి ఒక విద్యార్థిని 108 సార్లు పొడిచి గాయపరిచారు. దీనిపై ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏయిరోడ్రోమ్ పోలీసులను కోరాం. ఇంత చిన్న వయసులో ఆ ముగ్గురు విద్యార్థులు ఎందుకంత హింసాత్మక ప్రవర్తించారనేది పోలీసులు తేల్చాలి’ అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వ్యాఖ్యానించారు. నా కొడుకు స్కూల్ నుంచి వచ్చినపుడు అతని ఒంటిపై చాలా గాయాలున్నాయి. గాయాల గురించి అడిగితే జరిగిన ఘటనను అతడు వివరించాడు. అసలు వాళ్లెందుకంత హింసాత్మకంగా దాడి చేశారో అర్థం కావడం లేదు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అడిగితే స్కూల్ మేనేజ్మెంట్ ఇవ్వడం లేదు’అని గాయపడిన విద్యార్థి తండ్రి చెప్పారు. ఇదీచదవండి..ట్రాక్ దాటుతుండగా..ఆ ఏనుగులను -
జీప్ మోస్ట్ అఫార్డబుల్ ఎస్యూవీ, ధరెంతంటే...
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ఫేమస్ ఆటోమొబైల్ బ్రాండు జీప్, ఎట్టకేలకు తన మేడిన్ ఇండియా మోస్ట్ అఫార్డబుల్ ఎస్‌యూవీని భారత్ లో ప్రవేశపెట్టింది. జీప్ కంపాస్ ను బుధవారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతేడాది అంతర్జాతీయంగా లాంచ్ అయిన ఈ జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్, హోండా సీఆర్-వీలకు గట్టి పోటీనిచ్చేందుకు మార్కెట్లోకి వచ్చింది. మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌లో ఉన్న ఫియట్ ఆటోమొబైల్స్ కేంద్రంలో దీన్ని రూపొందించారు. రైట్-హ్యాండ్-డ్రైవ్ జీప్ కంపాస్ తయారీకి కేవలం ఈ ఒక్క తయారీ కేంద్రమే భారత్ లో ఉంది. ఈ కంపాస్ ధర రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది 56 లక్షల ధర కలిగిన వ్రాంగ్లర్, 93 లక్షల ధర కలిగిన గ్రాండ్ చెరోకి ధర కంటే చాలా తక్కువగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో నిలదొక్కుకోవడానికి అఫార్డబుల్ ధరలోనే జీప్ కంపాస్ ను తీసుకొస్తున్నామని కంపెనీ కూడా చెబుతోంది. ధర విషయాన్ని పక్కనబెడితే, ఈ ఎస్యూవీ 1.4 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఆప్షన్లను కలిగి ఉంది. సిక్స్ స్పీడు మాన్యువల్ లేదా సెవన్ స్పీడ్ ఆటో బాక్స్ ను ఇది ఆఫర్ చేస్తోంది. ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ను ఇది కలిగి ఉంది. స్నో, శాండ్, రాక్ ఆప్షన్ డ్రైవింగ్ మోడ్స్ తో పవర్ డెలివరీ, డ్రైవ్ డైనమిక్స్ ను మార్చుకోవచ్చు. ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హెడ్ లైట్స్, బ్లాక్ రూఫ్ ఆప్షన్, సేఫ్టీ కోసం 50 ప్లస్ సెక్యురిటీ ఫీచర్లను దీనిలో పొందుపరచింది. ఆరు ఎయిర్ బ్యాగులతో ఇది రూపొందించింది. ఈ కంపాస్ లోని ఇతర సేఫ్టీ ఫీచర్లు.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటివి కలిగి ఉన్నాయి. నలుపు లేత గోధుమరంగులో ఇంటీరియర్స్ కలిగి ఉండబోతుంట. ఆపిల్ కారు ప్లే, గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను సపోర్టు చేసేలా ఏడు అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో దీన్ని రూపొందించారు. -
బ్లూచిప్స్ ఫలితాలే దిక్సూచి..!
ఒడిదుడుకులు కొనసాగుతాయ్.. ♦ ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కూడా కీలకమే... ♦ ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: బడా కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రపంచ స్టాక్ మార్కెట్ల ట్రెండ్ కూడా కీలకమేనని పేర్కొన్నారు. అయితే, గురువారంనాడు డెరివేటివ్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ వారంలో మూడో త్రైమాసిక(క్యూ3) ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న బ్లూచిప్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకీ, వేదాంత, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ తదితర దిగ్గజాలు ఉన్నాయి. మరోపక్క, రిపబ్లిక్ డే(26న) సెలవు కారణంగా ఈ వారం ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. గ్లోబల్ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర వంటి అంశాలకు అనుగుణంగా స్వల్పకాలానికి మన మార్కెట్ల ట్రెండ్ ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపే అత్యధిక కంపెనీల ఫలితాలు వెల్లడికానుండటంతో మార్కెట్ల దృష్టి ప్రధానంగా వీటిపైనే ఉంటుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఫలితాలను వెల్లడించే కంపెనీలకు అనుగుణంగా స్టాక్స్ ఆధారితంగా కదలికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఫెడ్ సమీక్షపై దృష్టి...: ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ మంగళ, బుధవారాల్లో చేపట్టనున్న పాలసీ సమీక్షను కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. గత సమీక్షలో పదేళ్ల తర్వాత తొలిసారిగా అమెరికాలో వడ్డీరేట్లను ఫెడ్ పెంచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవుతున్న నేపథ్యంలో ఫెడ్ ఈ సారి వడ్డీరేట్లను మరోవిడత పెంచకపోవచ్చని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా 19 పాయింట్లు నష్టపోయి 24,436 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లు నష్టంతో 7,438 వద్ద స్థిరపడింది. తిరోగమనంలో ఎఫ్‌పీఐలు.. దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్ నుంచి నికరంగా రూ.9,963 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. ప్రధానంగా అంతర్జాతీయంగా వృద్ధి మందగమన భయాలు, ముడిచమురు ధరల తీవ్ర పతనం వంటివి దీనికి కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, దేశీ డెట్ మార్కెట్(బాండ్లు)లో మాత్రం ఎఫ్‌పీఐలు ఈ నెలలో రూ.2,353 కోట్లను నికరంగా వెచ్చించడం గమనార్హం. -
ఫలితాలే దిక్సూచి..!
ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా.. * ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణులు * నేడు ఇన్ఫీతో కార్పొరేట్ ఫలితాల సీజన్ షురూ * 13న టీసీఎస్, 14న హెచ్‌యూఎల్, 16న రిలయన్స్ ఆర్థిక ఫలితాలు... న్యూఢిల్లీ: ప్రధానమైన బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్ధేశించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సమీప కాలానికి జూలై-సెప్టెంబర్(క్యూ2) ఫలితాలే ప్రధాన ట్రిగ్గర్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే గెడైన్స్(పనితీరు అంచనాలు)పై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు నిపుణులు తెలిపారు. నేడు(సోమవారం) ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో క్యూ2 ఫలితాల సీజన్ ఆరంభమవుతోంది. 13న టీసీఎస్, 14న హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) కూడా ఫలితాలను ప్రకటించనున్నాయి. ఆ తర్వాత వారాంతంలో(16న) దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఫలితాలు వెలువడనున్నాయి. ‘కీలక కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలతోపాటు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), ద్రవ్యోల్బణం గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల ట్రెండ్ ఈ వారం మన స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌కు దిక్సూచిగా నిలవనున్నాయి. అదేవిధంగా డాలరుతో రూపాయి మారక విలువ, ముడిచమురు ధరల కదలికలు సైతం కీలక పాత్ర పోషిస్తాయి’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా వ్యాఖ్యానించారు. కీలక గణాంకాలు... మార్కెట్ సెంటిమెంట్‌ను బ్లూచిప్స్ ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని, తీవ్ర ఒడిదుడుకులకు కూడా ఆస్కారం ఉండొచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. మరోపక్క, నేడు కీలకమైన ఐఐపీ డేటాతో పాటు రిటైల్ ద్రవ్యోల్బణం గాణాంకాలు కూడా విడుదల కానున్నాయి. ఇన్వెస్టర్లు ఈ రెండింటిపైనా నిశితంగా దృష్టిపెడతారని ఆయన చెప్పారు. 14న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం డేటా వెల్లడికానుంది. కాగా, విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు దేశీ సూచీల ట్రెండ్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. గత వారం మార్కెట్... అమెరికాలో సెప్టెంబర్ నెలకు ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే దిగువన నమోదు కావడంతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును వాయిదా వేస్తుందన్న అంచనాలతో భారత్ సహా పలు విదేశీ స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగబాకాయి. సెప్టెంబర్ 29న ఆర్బీఐ అనూహ్యంగా అర శాతం పాలసీ రేటు తగ్గింపు చర్య కూడా దేశీ మార్కెట్‌కు సంజీవనిలా పనిచేసింది. దీంతో గత వారంలోనూ దేశీ సూచీలు లాభాల జోరును కొనసాగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 859 పాయింట్లు లాభపడి 27,080 వద్ద ముగిసింది. గడిచిన రెండు వారాల్లో సూచీ 1,216 పాయింట్లు(4.7%) ఎగబాకింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం 239 పాయింట్ల లాభంతో 8,190 వద్ద స్థిరపడింది. మళ్లీ కొనుగోళ్ల బాటలో విదేశీ ఇన్వెస్టర్లు... గత రెండు నెలలుగా భారీ మొత్తంలో పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మళ్లీ కొనుగోళ్ల బాటలోకి వచ్చారు. ప్రస్తుత అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(10వ తేదీ) దేశీ మార్కెట్లలోకి నికరంగా రూ.2,013 కోట్ల నిధులను వెచ్చించారు. ఇందులో స్టాక్స్‌లో రూ.1,607 కోట్లు, బాండ్లలోకి(డెట్ మార్కెట్) రూ.406 కోట్ల చొప్పున పెట్టుబడిగా పెట్టినట్లు సెబీ తాజా గణాంకాలు వెల్లడించాయి. ఆర్బీఐ అర శాతం రెపో రేటు కోతకు తోడు అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వాయిదా అంచనాలు ఎఫ్‌పీఐలతో తిరిగి ఉత్సాహం నెలకొనేలా చేసిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో రూ.23,000 కోట్లకు పైనే(ఈక్విటీ, డెట్ మార్కెట్) భారత్ నుంచి ఎఫ్‌పీఐలు నికరంగా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. చైనాలో ఆర్థిక మందగమనం భయాల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలడం, ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న ఆందోళనలు దీనికి ప్రధాన కారణం. కాగా, ఈ ఏడాది ఇప్పటిదాకా ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో రూ.22,654 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.39,802 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేశారు.